గుడివాడ అభివృద్ధికి శాయశక్తుల కృషిచేస్తా 

ఎమ్మెల్యే కొడాలి నాని

గుడివాడ: గుడి వాడ అభివృద్ధికి తన శాయ శక్తుల కృషిచేస్తా నని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. నాలుగోసారి విజయం సాధించిన కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని)ను ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు  గజమాలతో ఘనంగా సత్కరిం చారు. బస్టాండ్‌ సమీపంలోని తిరుమల ఆటోమొబైల్స్‌లో జరిగిన కార్యక్రమంలో వైశ్య సంఘ మాజీ అధ్యక్షుడు కొణిజేటి శ్రీనివాస్‌, వాసవీ విదర్భ పురి మాజీ అధ్యక్షురాలు రాధాకుమారి, వైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడు యేల్చూరి వేణుగోపాలరావు తదితరులు ఎమ్మెల్యే నానిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. తనను ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఉప్పాల రాము, కొణిజేటి హర్ష, పొట్లూరి కృష్ణారావు పాల్గొన్నారు.

Back to Top