ఉనికి కోసమే టీడీపీ, జనసేన పార్టీల అబద్ధపు ప్రచారం 

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య ఫైర్‌

తమ ఉనికి కోసమే టీడీపీ, జనసేన పార్టీల అబద్ధపు ప్రచారం

వైయస్‌ఆర్‌సీపీకి వస్తున్న ఆదరణను ఓర్వలేకే బురద జల్లే ప్రయత్నం

గుంటూరు: తమ ఉనికి కోసమే టీడీపీ, జనసేన పార్టీల అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య మండిపడ్డారు. గత ప్రభుత్వంలో సహచరుడిగా ఉన్న పవన్‌..ఆ రోజు పేదలకు ఎందుకు మూడు సెంట్ల స్థలం ఇవ్వలేదని, పక్కా ఇల్లు కట్టిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ఆదరణను ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఎమ్మెల్యే రోషయ్య మీడియాతో మాట్లాడారు.

2014 ఎన్నికల సమయంలో అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా గృహాలు మంజూరు చేస్తామన్నారు. ఆ రోజు మిత్రుడిగా, సహచరుడిగా పవన్‌ ఉన్నాడు. టీడీపీతో సహజీవనం చేసిన పవన్‌ ఎందుకు గత ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ప్రశ్నించే పార్టీ కదా? ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేదు. ప్రజలు మీ హామీలను మరచిపోలేదు. అందుకే 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. టీడీపీ కనుసన్నల్లో జనసేన నడుస్తుందని కిలారి రోశయ్య విమర్శించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top