జేసీ దివాకర్‌రెడ్డిని కూడా వెంటనే అరెస్టు చేయాలి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

అనంతపురం: జేసీ ట్రావెల్స్‌ అక్రమాల కేసులో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలని, దివాకర్‌రెడ్డి అండతోనే అక్రమాలు జరిగాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కేతారెడ్డి పెద్దారెడ్డి డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు నిషేధించిన బీఎస్‌3 వాహనాలను బీఎస్‌4గా తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌ చేయించిన కేసులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, అతని తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి అరెస్టులను స్వాగతిస్తున్నానన్నారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిషేధించబడిన 154 వాహనాలను చౌకధరకు కొనుగోలు చేసి దొంగ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌ చేయించారని, ప్రజల ప్రాణాలంటే జేసీ ట్రావెల్స్‌కు లెక్కలేకుండా పోయిందని మండిపడ్డారు. వందలాది మంది ప్రయాణికులను జేసీ ట్రావెల్స్‌ పొట్టన పెట్టుకుందని దుయ్యబట్టారు. తాడిపత్రి సీఐ, ఎస్‌ఐల సంతకాలను కూడా జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ చేసిందన్నారు. జేసీ ట్రావెల్స్‌ అరాచకాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top