జంట హత్యల్లో తన ప్రమేయం ఉందని నిరుపించే దమ్ము లోకేష్ కు  ఉందా ?

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స‌వాల్‌

వైయ‌స్సార్‌ హయాం నుంచే మేం ఫ్యాక్షన్‌కు దూరంగా ఉన్నాం

 కర్నూలు:  గ‌డివేముల మండలం పెసరవాయి గ్రామంలో జరిగిన జంట  హత్యల్లో తన ప్రమేయం ఉందని నిరుపించే దమ్ము నారా లోకేష్ కు, టిడిపికు ఉందా అని వైయ‌స్ఆర్‌సీపీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే స్థాయి లోకేష్‌కు లేదని  మండిపడ్డారు. శుక్రవారం ఆయన క‌ర్నూలులోమీడియాతో మాట్లాడుతూ.. లోకేష్‌ బఫూన్‌కు తక్కువ.. జోకర్‌కు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. లోకేష్‌ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడని దుయ్యబట్టారు.

జంట హత్యలకు గురైన వ్యక్తులు గతంలో తన గెలుపు కోసం కృషి చేశారని, వారిని రాజకీయంగా పైకి తెచ్చింది తానేనని పేర్కొన్నారు. వారు ఎన్నికల అనంతరం పార్టీలోకి వస్తామంటే కొన్నాళ్ళు ఆగమని చెప్పనని, ఈ నెల 7వ తేదీన కుడా ఫోనులో గ్రామ సమస్య గురించి మాట్లాడన్నారు.అలాంటి వ్యక్తులను చంపాల్సిన అవసరం తనకు లేదన్నారు.

చెరుకుల‌పాడు నారాయణరెడ్డి హత్య కేసు దోషులకు అండగా నిలిచింది మీరు కాదా?. మా ప్రభుత్వంలో పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. జంట హత్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. దేశంలో ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరపొచ్చు అని కాటసాని స్పష్టం చేశారు. రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన హితవు పలికారు.  2004 వైయ‌స్సార్‌ హయాం నుంచే మేం ఫ్యాక్షన్‌కు దూరంగా ఉన్నాం. టీడీపీ హయాంలో రాయలసీమకు అన్యాయం జరిగింది. వైయ‌స్సార్‌ హయాంలోనే రాయలసీమకు నీరు అందించామని కాటసాని రాంభూపాల్‌ అన్నారు.

లోకేష్‌కు సంస్కారం లేదు: బీవై రామయ్య
నారా లోకేష్‌కు సంస్కారం లేదని కర్నూలు మేయర్‌ బీవై రామయ్య మండిపడ్డారు. లోకేష్ అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. నారా లోకేష్‌, చంద్రబాబు.. కులాలు, మతాలకు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చివరికి శవాలతో కూడా రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నోరు వుందని విమర్శలు, ఆరోపణలు చేస్తే ప్రజలు రాజకీయ సమాధి కడతారన్నారు.   

నా భ‌ర్త‌ను చంపినప్పుడు సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయ‌లేదు: ఎమ్మెల్యే శ్రీ‌దేవి

త‌న భ‌ర్త చెర‌కుల‌పాడు నారాయ‌ణ‌రెడ్డిని టీడీపీ నేత‌లు హ‌త్య చేసిన‌ప్పుడు చంద్ర‌బాబు, నారా లోకేష్ అప్పుడెందుకు సీబీఐ ఎంక్వైరీ వేయ‌లేదని ప‌త్తికొండ ఎమ్మెల్యే శ్రీ‌దేవి ప్ర‌శ్నించారు. గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో జరిగిన జంట హత్యల్లో వైయ‌స్సార్సీపీ నాయకుల ప్రమేయం ఉందని నిరుచూపించే దమ్ము నారా లోకేష్ కి ఉందా అని స‌వాలు విసిరారు.త‌న‌ భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి, బోయ సాంబశివుడి గారిని చంపినప్పుడు ఏమైంది సి బి ఐ ఎంక్వయిరీ, గత ప్రభుత్వం లో మీరు చేపించిన హత్యలు వల్లే ప్రజలు మిమ్మల్నిఛీకొట్టి మాకు అధికారం ఇచ్చార‌ని తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారీ భారత రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకం చట్టవిరుద్ద‌మ‌న్నారు. సింహం సింహం అంటున్న నారా లోకేష్ గ్రామ సింహం అని ఎద్దేవా చేశారు.  ప్రజలను రెచ్చగొట్టే ధోరణి లో మాట్లాడిన నారా లోకేష్ పై కేసు నమోదు చేయాలని శ్రీ‌దేవి కోరారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top