గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల్లో వైయస్‌ఆర్‌సీపీదే గెలుపు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి ధీమా

గుంటూరు: గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేయలేని అభివృద్ధిని.. 30 నెలల్లోనే తాము చేసి చూపించామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో పిడుగురాళ్లలో ఒక్క ఇంటికైనా కుళాయి ద్వారా నీరిచ్చారా..? అని తెలుగుదేశం పార్టీ నేతలను ప్రశ్నించారు. గురజాల, దాచేపల్లిని నగర పంచాయతీలుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మార్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో.. గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల్లోనూ అలాంటి ఫలితాలే రానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top