అన్నం పెట్టమంటే..బిర్యాని పెట్టారు

ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి
 

అమరావతి: పల్నాటి ప్రాంత ప్రజలు ఆకలేస్తుంది అన్నం పెట్టమని కోరితే..వైయస్‌ జగన్‌ బిర్యాని పెట్టారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. బడ్జెట్‌పై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తొలి బడ్జెట్‌తోనే రాష్ట్ర రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మహేష్‌రెడ్డి మాట్లాడారు.  మాట ఇచ్చే ముందు ఆలోచిస్తామని, మాట ఇచ్చిన తరువాత ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకోవాలన్న వ్యక్తిత్వం ఉన్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన వ్యక్తిత్వం మరోసారి రుజువైందని చెప్పారు. నవరత్నాల ద్వారా ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ ప్రజల ముందుకు వచ్చారని, తనకు అవకాశం ఇస్తే రాష్ట్ర రూపురేఖలు మార్చుతానని మాటిచ్చారన్నారు. ఈ రోజు అదే కోణంలో అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రైతు భరోసా, ఆసరా, పింఛన్‌ కానుక, గృహ నిర్మాణాలు వంటి ఎన్నో పథకాలు ప్రకటించారన్నారు. ఈ బడ్జెట్‌ రాష్ట్ర రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. పల్నాటి ప్రాంత వాసులు ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే ..వైయస్‌ జగన్‌ మాకు బిర్యాని పెట్టారని చెప్పారు. గురుజాలలో మెడికల్‌ కాలేజీ స్థాపించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని, నా ఆనందానికి అవధుల్లేవని చెప్పారు. ప్రాజెక్టుల్లోని అవినీతిని రివర్స్‌టెండర్ల ద్వారా సేవ్‌ చేయగలిగితే అవినీతిరహిత రాష్ట్రంగా మార్చడం సాధ్యమవుతుందన్నారు. 

 

తాజా ఫోటోలు

Back to Top