కన్నా.. చంద్రబాబు, ఎల్లోమీడియా ట్రాప్‌లో పడ్డారు

ప్రపంచం మారుతున్నా.. చంద్రబాబు మారడం లేదు

ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్‌ రూ.730కి ఏపీ కొనడం తప్పా..?

మరి రూ.790 పెట్టి కొనుగోలు చేసిన కేంద్రానిది తప్పుకాదా..?

కరోనా నివారణ చర్యల్లో దేశంలోనే ఏపీ ఒకడుగు ముందుంది

వలంటీర్లు ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు

సీఎం వైయస్‌ జగన్‌ది తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే తత్వం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

తాడేపల్లి: కన్నాలక్ష్మీనారాయణ చంద్రబాబు, ఎల్లోమీడియా మాయలో పడి పిచ్చిచేష్టలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. కరోనా కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే వాటిపై కూడా టీడీపీ, ఎల్లోమీడియా చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ కేంద్రం ప్రభుత్వం కంటే సీఎం వైయస్‌ జగన్‌ సర్కార్‌ తక్కువ ధరకు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఇంత పారదర్శకంగా సీఎం వైయస్‌ జగన్‌ ముందుకెళ్తుంటే ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకొని చంద్రబాబు, కన్నాలక్ష్మీనారాయణ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు విజ్ఞులు కాబట్టే సీఎం వైయస్‌ జగన్‌ను గత సంవత్సరం అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేశారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. కన్నా లక్ష్మీనారాయణ కరోనా వ్యాప్తికి వైయస్‌ఆర్‌ సీపీ కారణం అని మాట్లాడుతున్నాడు. అదే రోజు టీడీపీ నాయకుడు సబ్బం హరి ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడాడు. ఇద్దరూ కలిసి ఒకటే ప్రెస్‌మీట్‌ పెడితే సరిపోయేది. కరోనా వ్యాప్తి నివారణలో దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ఒక అడుగు ముందున్న రాష్ట్రం ఏపీ.
కరోనా పాజిటివ్‌ కేసుల గణాంకాలు...
136 కోట్ల జనాభా కలిగిన దేశంలో 17,656 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. సగటు .001, ఐదు కోట్ల మంది ఉన్న ఆంధ్రరాష్ట్రంలో 722 కేసులు అది కూడా .001 శాతం. అదే 6 కోట్ల జనాభా ఉన్న గుజరాత్‌లో 1851 పాజిటివ్‌ కేసులు అంటే .003 శాతం, 7 కోట్లు ఉన్న మధ్యప్రదేశ్‌లో 1485 కేసులు సగటు .002 శాతం. ఏ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం లేదు. అక్కడ విపరీత పరిణామాల వల్ల కేసులు పెరిగి ఉండొచ్చు. కానీ ప్రయత్నంలో లోపం లేదు.
ఏ రాష్ట్రంలో లేని వలంటీర్ల సిస్టమ్‌ మన రాష్ట్రంలో ఉంది
సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఎటువంటి లోపాలకు తావు ఇవ్వకుండా కరోనా వ్యాధిని అరికట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేని వలంటీర్ల సిస్టమ్‌ మన రాష్ట్రంలో ఉంది. 4 లక్షల మంది ప్రాణాలను పణంగా పెట్టి ప్రతి 50 ఇళ్లను కాపాలా కాస్తున్నారు. వైద్యాధికారులు, పోలీసులు, ఇతర అధికారులతో పాటు వలంటీర్లు 50 ఇళ్ల ప్రజలతో మాట్లాడడం, సమస్యలు తీర్చడం, రేషన్‌ అందించడం, వ్యాధిగ్రస్తులను క్వారంటైన్లకు పంపించడం ఇలా పకడ్బందీగా చేస్తుంటే కనీసం ప్రోత్సహించకుండా చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ ప్రతి రోజు విమర్శలు చేస్తున్నారు.
కాణిపాకంలో కన్నా ప్రమాణం చేయగలడా..?
కాణిపాకం అంటున్నారు. ఆ కాణిపాకంలో కన్నాలక్ష్మీనారాయణ ప్రమాణం చేయగలరా..? ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్‌ ఏపీ రూ.730 కొనడం తప్పా..? అలా అయితే కేంద్ర ప్రభుత్వం రూ.790 కొనుగోలు చేయడం కూడా తప్పేకదా..? కన్నాలక్ష్మీనారాయణ తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. సలహాలు, సూచనలు ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి చంద్రబాబు, ఎల్లోమీడియా మాయలో పడి దుర్మార్గమైన చేష్టలు చేస్తున్నాడు.
బాబు అలవాటే.. ఆ పార్టీ నాయకులది కూడా
80 సీట్లు ఉంటే ఈ సమయంలో వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసేవాళ్లమని టీడీపీ నేత సబ్బం హరి మాట్లాడుతున్నాడు. ఇంత అతలాకుతలమయ్యే పరిస్థితుల్లో ఇలాంటి మాటలా మాట్లాడేది. 80 సీట్లు ఉంటే గతంలో లాగా ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారా.. ఈ సమయంలో.. ఇంత దుర్మార్గమైన ఆలోచనలోన ఉండేది. ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు ఆ పార్టీలోని నాయకులకు అలవాటవుతాయి.
అన్ని చర్యలు తీసుకుంటున్నాం..
ఏది ఏమైనా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పినట్లు స్వీయనిర్బంధంలో ఉందాం. ఇంకా ఎటువంటి ఆంక్షలు వచ్చినా తూచా తప్పకుండా పాటిద్దాం. కచ్చితంగా కరోనా మహమ్మారిని గెలిచే రోజు వస్తుంది. కరోనా నియంత్రణకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.
బంగారం కంటే కంచు శబ్ధం ఎక్కువ
బంగారం కంటే కంచు శబ్ధం ఎక్కువ, కానీ విలువ బంగారానిదే ఎక్కువ. అలాగే సీఎం వైయస్‌ జగన్‌ తక్కువ మాట్లాడి ఎక్కవ పనిచేసే తత్వం. చంద్రబాబు గంటల కొద్ది సోదిపెట్టి పనిచేయడు. చేసేవారిని చేయనివ్వడు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top