నవరత్నాలు దేశానికే ఆదర్శం

రైతు భరోసాతో ప్రతి అన్నదాతకు ఆసరా

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కరణం  ధర్మశ్రీ

అమరావతి: ప్రభుత్వ విధానాలను  వివరించిన  గవర్నర్‌ ప్రసంగం అద్భుతంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఆయన మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. గతంలో వైయస్‌ఆర్‌ అద్భుతమైన పాలన చేశారన్నారు.సంక్షేమ,అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో వైయస్‌ఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.మళ్లీ వైయస్‌ఆర్‌ పాలనను అందించాలనే అంకుఠిత దీక్షతో ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు.తండ్రి ఆశయసాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.పేదలను ఆదుకోవాల్సిన బాధ్యతను వైయస్‌ జగన్‌ తన భుజస్కందాలపై వేసుకున్నారన్నారు.గతంలో కొందరు పెద్దలు కుట్రలు పన్ని వైయస్‌ జగన్‌ను రాజకీయంగా అణదొక్కడానికి అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు.వైయస్‌ఆర్‌ రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో ఏవిధంగా రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చారో దానిని సూర్ఫిగా తీసుకుని..నేడు ఆయన తనయుడు వైయస్‌ జగన్‌.. రైతు భరోసా అనే కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారన్నారు.ప్రతి రైతుకు రైతు భరోసా ఆసరాగా ఉంటుందన్నారు.దేశంలోనే ఆదర్శవంతంగా ఉండాలని వైయస్‌ జగన్‌ నవరత్నాలు తెచ్చారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top