విజయవాడ: బీసీల గురించి మాట్లాడే అర్హత అచ్చెన్నాయుడు, యనమలకు లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ‘తోకలు కత్తిరిస్తా’నని బీసీలపై చంద్రబాబు బెదిరింపులకు దిగినప్పుడు యనమల, అచ్చెన్నాయుడు ఎక్కుడున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. బీసీలను చంద్రబాబు మోసం చేస్తే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారన్నారు. చంద్రబాబుని బ్లాక్‌మెయిల్ చేసి తెలుగుదేశం పార్టీకి అచ్చెన్నాయుడు అధ్యక్షుడు అయ్యాడని ఎద్దేవా చేశారు. ఈఎస్‌ఐ స్కాంలో ముడుపులు వల్లే అచ్చెన్నకు పదవి దక్కినట్లుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి 2.70 కోట్ల మంది బీసీలకు రూ.33 వేల కోట్ల సంక్షేమ పథకాలిచ్చారన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంతా కలిసి టీడీపీని భూస్థాపితం చేసినా చంద్రబాబుకు, ఆయన తాబేదారులకు బుద్ధిరాలేదన్నారు. సీఎం వైయస్ జగన్‌ను బీసీలు అభినందిస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు.