రాజకీయంగా బాబు కోమా.. సభలో టీడీపీ డ్రామా..

ఇప్పటికే టీడీపీకి ప్రజలు సమాధి కట్టారు.. ఇక పునాదులు లేకుండా చేస్తారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

అసెంబ్లీ: చనిపోయిన వారిని చూసి ఎవరైనా బాధపడతారు.. కానీ, శవం కోసం ప్రధాన ప్రతిపక్షం గుంటనక్కలా ఎదురుచూస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. ఎవరు, ఏరకంగా చనిపోయినా.. రాజకీయం చేయడానికి శవం దొరికిందని చంద్రబాబు, టీడీపీ సభ్యులు రాక్షసానందం పొందుతున్నారని, ఇలాంటి ప్రతిపక్షం ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడారు.

రాజకీయంగా కోమాలో ఉన్న చంద్రబాబు.. తన సభ్యులతో అసెంబ్లీలో డ్రామాలు ఆడిస్తున్నాడని, సాధారణ మరణాలను కూడా సారా మరణాలుగా చిత్రీకరిస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు కోమా, టీడీపీ సభ్యుల డ్రామా చూసి.. ప్రజలంతా అయ్యే రామా అని ముక్కువేలేసుకుంటున్నారన్నారు. మద్యపానంపై లెక్కలతో సహా చర్చిద్దాం అంటే టీడీపీ జంకుతుందన్నారు. జంగారెడ్డిగూడెంలో తాగుడు వ్యసనంతో దీర్ఘకాలిక వ్యాధి వల్ల ఇద్దరు చనిపోతే 16, 18 అంటూ దొంగలెక్కలు చెబుతున్నారన్నారు. సభా సమయాన్ని వృథా చేస్తున్నారని, ప్లకార్డులను చింపేసి స్పీకర్‌ మీద వేశారని మండిపడ్డారు. టీడీపీ విధానం చూసి ప్రజలు ఉపేక్షించరని,  ఇప్పటికే టీడీపీకి రాజకీయంగా సమాధి కట్టిన ప్రజలు.. ఇక పునాదులు లేకుండా  చేస్తారన్నారు. పేదలు, మద్యతరగతి ప్రజల జీవితాలు నాశనం కాకూడదని రాష్ట్రంలో బెల్టుషాపులు లేకుండా చేసి.. సగం మేర మద్యం దుకాణాలు తగ్గించి దశలవారీగా మద్యపాన నిషధం దిశగా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. ప్రభుత్వం దశలవారి మద్య నిషేధం వైపు అడుగులు వేస్తుంటే.. టీడీపీ నేతలు దాన్ని విషాదం అని మాట్లాడుతున్నారని, గతంలో వైన్‌షాపులు నడిపిన డాన్‌లు అంతా  మద్యనిషేధానికి తూట్లుపొడవాలని కుట్ర చేస్తున్నారన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top