వైయస్‌ జగన్‌ది ప్రజా సంక్షేమ ప్రభుత్వం

ప్రజలు వైయస్‌ఆర్‌ పాలన గుర్తుకుతెచ్చుకుంటున్నారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు

తూర్పుగోదావరి: వైయస్‌ జగన్‌ది ప్రజా సంక్షేమ ప్రభుత్వమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్‌ఆర్‌సీపీ గెలుపును అడ్డుకోవడానికి చాలామంది ప్రయత్నించారన్నారు.నిత్యం ప్రజల్లో ఉండటం వల్లే వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధించిందని తెలిపారు.ఇచ్చిన హమీల అమలు జగన్‌ ప్రారంభించారని తెలిపారు.వైయస్‌ జగన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకం నిరూపితమయ్యే విధంగా రాష్ట్రంలో 151 అసెంబ్లీస్థానాలు గెలుచుకుని దేశ రాజకీయ చరిత్రలోనే  సంచలనంగా పేర్కొన్నారు.వైయస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణాస్వీకారం చేసినప్పుటి నుంచి పేద ప్రజల పట్ల చూపిస్తున్న శ్రద్ధ,ప్రేమను చూస్తూ ఒకసారి  దివంగత మహానేత వైయస్‌ఆర్‌ను గుర్తుకుతెచ్చుకున్నారని తెలిపారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నవయస్సులోనే ఇంత  పరిణితి ప్రదర్శించడం ప్రజలు  అశ్చర్యవ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top