వైయస్‌ఆర్‌ స్వర్ణయుగం తిరిగి ప్రారంభమైంది

పెన్నానది ముందుకొచ్చి సీఎం వైయస్‌ జగన్‌ కాళ్లకు నీరిచ్చింది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

సర్వేపల్లి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం రాష్ట్రంలో తిరిగి ప్రారంభమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని కాకుటూరులో వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ.. మహనీయుడు గ్రామానికి వచ్చినా, పెద్దల ఇళ్లకు వచ్చినా స్వాగతం పలికి కాళ్లు కడుక్కునేందుకు నీరు అందిస్తాం. రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడానికి నెల్లూరు జిల్లా సర్వేపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు పెన్నానది ముందుకువచ్చి నీరు అందించిందన్నారు. రైతు భరోసా రూ.12500 ఇస్తానని ప్రకటించారు. దాన్ని రూ. వెయ్యి పెంచి రూ.13,500 పెంచి ఐదేళ్లలో రైతు కుటుంబానికి రూ.67,500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి రైతాంగం తరుఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన కావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని చెప్పాం.. 12 సంవత్సరాలుగా ఏ రోజూ నెల్లూరులోని జలాశయాలకు నీరు వచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ నీటితో కళకళలాడుతున్నాయంటే వైయస్‌ఆర్‌ యుగం తిరిగి ఏపీలో ప్రారంభమైందని చెప్పడానికి సంకేతమన్నారు. రైతులు ఎక్కడ సుభిక్షంగా ఉంటే అక్కడ ధర్మరాజు పాలన అంటారు. నిన్నటి వరకు పాండురాజు పాలన పోయి ఈ రోజు ధర్మరాజు పాలన వచ్చిందన్నారు.

చంద్రబాబు ప్రేతకళలో వెలవెలలాడుతున్నాడని ఎమ్మెల్యే కాకాణి అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి మహాత్మా గాంధీ కలలు నిజం చేశారన్నారు. నాలుగున్నర నెలల్లో ప్రధాన వాగ్దాలన్నీ అమలు చేస్తున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. వైయస్‌ జగన్‌ కష్టంతో 150 మంది శాసనసభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. నాన్‌ఫిషర్‌ మెన్‌ ప్యాకేజీ ఇవ్వమని అడిగితే.. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే అమలు చేసేందుకు ప్రయత్నం చేద్దామని మారు మాట్లాడకుండా సంతకం పెట్టి కాగితం ఇచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రైతు పక్షపాతి అని, నెల్లూరులో వైయస్‌ఆర్‌ రైతు భరోసా ప్రారంభించడం గర్వించదగ్గ విషయమన్నారు.

Back to Top