ప్రజల ఆశలు నెరవేరుస్తాం

పార్టీలకతీతంగా అర్హులందరికి సంక్షేమ పథకాలు

పనితీరు ఆధారంగానే 2024లో ఓట్లు అడుగుతాం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి

నెల్లూరు: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తొలిసారిగా అన్ని అసెంబ్లీ,పార్లమెంటు స్థానాలు గెలిచి రికార్డు సృష్టించిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని ఆ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు.సోమవారం నెల్లూరు వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజలు ఎన్నో ఆశలతో వైయస్‌ఆర్‌సీపీకి ఓట్లు వేసి గెలిపించారని...వారి ఆశలు నెరవేర్చే విధంగా పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పనితీరు ఆధారంగానే 2024లో ఓట్లు అడుగుతామని ఆయన తెలిపారు..టీడీపీ ప్రభుత్వం వల్లే పక్షపాత ధోరణితో కాకుండా, అవినీతి,అక్రమాలకు తావులేకుండా పాలన అందిస్తామని తెలిపారు. పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top