తాడేపల్లి: దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన చంద్రబాబు.. దళిత బాంధవుడు ఎలా అయ్యారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబును దళితులు నమ్మే పరిస్థితి లేదన్నారు. దళితుల సంక్షేమం కోసం రూ.53 వేల కోట్లు ఖర్చు చేశాం.. గతంలో చంద్రబాబు దళితుల కోసం ఏం చేశారు. అంబ్కేదర్ స్ఫూర్తితో సీఎం వైయస్ జగన్ పాలన కొనసాగిస్తున్నారు. దళితులు ఏం పీక్కారన్న లోకేష్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు. ఎస్సీ నియోజకవర్గాలలో అధిక భాగం ఎందుకు ఓడిపోయారో అర్థం చేసుకో చంద్రబాబు. 28 పథకాలు దళితుల కోసం తన హయాంలో పెట్టినట్లు చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారు. వైయస్ జగన్ హయాంలో దళితులకు ఎంతో మేలు జరిగింది’’ అని అనిల్‌కుమార్ అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శాసనసభ్యులు కైలే అనీల్‌కుమార్, శాసనమండలి సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. దళితుల పట్ల రాబందువు బాబుః దళితులకు సంబంధించి నిన్న టీడీపీ నేతలు ఒక పుస్తకాన్ని విడుదల చేసుకున్నారు. పేదల పెన్నిధి, దళితుల ఆత్మబంధువు అంటూ చంద్రబాబును ఆ పుస్తకంలో పేర్కొనడాన్ని చూసి రాష్ట్రప్రజలంతా పగలబడి నవ్వుకుంటున్నారు. పుస్తకంలో అచ్చుతప్పి పడి ఉంటుందని.. దళితుల పట్ల రాబంధువు చంద్రబాబు అనడం నూటికి నూరుశాతం వర్తిస్తుందని దళిత మేధావులు అంటున్నారు. అందుకే, ఈ సందర్భంలో మేము చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. 14 ఏళ్లు సీఎంగా, ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు దళితులకు చేసిన మేలేంటి..? అని అడుగుతున్నాము. 2019లో దళితుల ఓట్లెందుకు పడలేదు..? నిత్యం అబద్ధాలను చెబుతూ, అవే రాజకీయాలు చేస్తూ.. దళితులను తానేదో ఉద్దరించానని చంద్రబాబు చెప్పుకుంటే సరిపోదు. ఆయన హయాంలో దళితులకు సంబంధించి చెప్పుకోదగ్గ ఒక్క సంక్షేమ పథకాన్నైనా ఈరోజు ప్రజలకు గుర్తుచేసి ఓట్లు అడిగే దమ్ము బాబుకు లేదు. పైగా, మేం అధికారంలోకి వచ్చాక 28 దళిత పథకాల్ని తొలగించామని అబద్ధాల ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు సీట్లు 29 ఉంటే, వాటిల్లో 28చోట్లా టీడీపీని ఎందుకు ఓడించారు..? ఈ విషయంపై బాబు, ఆయన కొడుకు లోకేశ్ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా..? నిజంగా, దళితులకు తామేదైనా మేలు చేస్తే వారంతా తనకు తన పార్టీకి అండగా ఉండేవారు కదా..? ఆనాడు తాము నిర్లక్ష్యంగా ఉన్నందుకే టీడీపీని దళితులు ఛీత్కరించుకున్నారనే వాస్తవాన్ని ఇప్పటికైనా బాబు, లోకేశ్‌లు తెలుసుకోవాలి. ఆనాడు పథకాలన్నీ పెత్తందార్ల చేతుల్లోనేః నాడు చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరిట పేదల సంక్షేమ పథకాలన్నీ పెత్తందార్ల చేతుల్లోకే వెళ్లాయనేది జగమెరిగిన సత్యం. దళితుల భుజాన బాబు గన్ పెట్టి కాల్చేరకమనే సంగతిని ఊరూరా ఏమూలకెళ్లినా పేదలు చెబుతారు. బాబు మాటకొస్తే సబ్‌ప్లాన్ అంటాడు కదా.. మరి, ఆయన ఐదేళ్ల పాలనలో సబ్‌ప్లాన్ కింద ఎంత ఖర్చుపెట్టారు..? అని అడుగుతున్నాను. దళితుల పేర్లను అడ్డంగా పెట్టుకుని ఇన్నోవా కార్ల రుణాలన్నీ పెత్తందార్ల చేతుల్లోకి వెళ్లిన మాట వాస్తవం కాదా..? ఈ పథకం వెనుక మతలబును ఆనాడు స్వయంగా టీడీపీలోని వారే ఫిర్యాదులు చేశారన్నది మరిచిపోకూడదు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో సబ్ ప్లాన్ కింద రూ.33వేల కోట్లు ఖర్చు పెడితే.. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లులోనే ఇప్పటికి రూ. 53 వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారికి దక్కుతుంది. దళితద్రోహి చంద్రబాబుః చంద్రబాబు మానసిక పరిస్థితి రాన్రానూ దిగజారిపోతుంది. ఈ ప్రపంచంలో తానే పెద్ద మేధావినని, శాస్త్రవేత్తనని చెప్పుకుంటున్న బాబుకు రాబోయే కాలంలో ఎదురయ్యే విషమపరిస్థితిపై ఆయన కుటుంబం ఆందోళన చెందే సమయం ఆసన్నమైంది. హైదరాబాద్, సైబరాబాద్ అభివృద్ధి చేశానని.. సెల్‌ఫోన్ కనిపెట్టానని బాబు చెప్పుకోవడంలో ఎంత నిజముందో.. దళితుల్ని ఉద్ధరించానని చెప్పడం కూడా అంతే అబద్ధమని చెప్పాలి. దళితద్రోహిగా బాబును గుర్తించారు కనుకనే 2019లో ఆయన్ను ఓడించి ఇంట్లో కూర్చొబెట్టారు. 2024లో కూడా బాబుకు కన్నీరేః పర్యటనల్లో ప్రజల్ని మభ్యపెట్టేందుకు పిచ్చికూతలు, వెర్రిమాటలతో బాబు ఎన్ని వేషాలేసినా.. ఆయన మాటల్ని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన అధికారం వెలగబెట్టిన 14 ఏళ్లలో పేదలకు ఎన్ని ఇళ్లస్థలాలిచ్చారో.. మేం ఈరోజు ఎన్ని లక్షలమందికి ఉచితంగా ఇళ్లు స్థలాల్ని పంపిణీ చేశామనే విషయంపై దమ్ముంటే బాబు చర్చకు రావాలి. దళితుల్ని తన రక్తసంబంధీకుల్లా చూస్తూ నా ఎస్సీ, నా ఎస్టీ.. నా బీసీ.. అని అక్కున చేర్చుకున్న మా నాయకుడు జగన్ గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఆశయ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. అదే బాబు మాత్రం ‘దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా..?’ అని అంటే.. ఆయన కొడుకు లోకేశ్ ‘దళితులు పీకిందేమీ లేదు..’ అని హీనంగా మాట్లాడతారా..? అందుకే, మీ మాటల్ని మరిచిపోలేని దళితులు 2024 ఎన్నికల్లో కూడా మిమ్మల్ని ఓడించి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీలో చర్చిద్దాం.. వచ్చే దమ్ముందా బాబూ..? – శాసనమండలి సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్ సవాల్ పేదల్ని ఉద్దరిస్తానంటూ ఈరోజు చంద్రబాబు కొత్త అవతారమెత్తి మాట్లాడుతున్నాడు. దళితులను తానేదో ఉద్దరించానిని, దళితులంతా తన పార్టీ వైపే ఉన్నారని చెప్పుకుంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బాబును నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అసలు, బాబుకు దళితుల మేలు గురించి మాట్లాడే అర్హత ఉందా..? అని అడుగుతున్నాను. జనాల్ని మభ్యపెట్టేందుకు ఏవేవో కబుర్లు చెప్పడం కాదు. అసలు, దళిత బంధువు ఎవరు.. దళితుల పాలిట రాబందువు ఎవరనేది అసెంబ్లీలో చర్చ పెడదాం.. వస్తావా బాబూ..? అని సవాల్ విసురుతున్నాను. దళితులకు మీరేం చేశారు..? అంటే మీరు చెప్పలేరు. అదే వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక మేమేమి చేశాం అనేది ప్రజల గడప వద్దకే వెళ్లి చెబుతున్నాం.. మరి అసెంబ్లీలో చర్చించ్చేందుకు నువ్వు సిద్ధమా బాబూ..? అని సవాల్ విసురుతున్నా. ఇదే విషయంపై ఓపెన్ డిబేట్ పెట్టి నిన్ను ఇదేవిధంగా అడగొచ్చు. అయితే, నీ నక్కజిత్తుల తెలివితేటలతో మాస్థాయి.. మీస్థాయి అని చెప్పి బహిరంగ చర్చను దాటేసే ప్రమాదం ఉందని మాకు తెలుసు. కనుకనే, ఎన్నిరోజులు పట్టినా.. దళితుల మేలు అనే అంశంపై అసెంబ్లీ వేదికగానే చర్చిద్దాం. దమ్ముంటే బాబు ఒప్పుకోవాలి. ‘నా ఎస్సీ .. నా ఎస్టీ’ అనే దమ్ముందా.. బాబు..? రాష్ట్రంలో దళితులంతా ప్రభుత్వ విధానాల పట్ల, అమలవుతోన్న సంక్షేమ పథకాల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో ముందెన్నడూ లేనివిధంగా దేవస్థాన బోర్డుల్లో చైర్మన్, మెంబర్ల పదవుల్లో 50 శాతం ఎస్సీ ఎస్టీ బీసీ లకు కేటాయించిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారికే ఉంది. బాబుకు మాకూ ఉన్న తేడా ఇదిః గతంలో చంద్రబాబు తన అధికారహయాంలో దళితులకు కేటాయించిన పదవుల్లోకొస్తే..ఆయన ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులిస్తే.. మేం ఐదు మంత్రి పదవులిచ్చాం. రెండుసార్లు హోంశాఖ, రెండు సార్లు డిప్యూటీ సీఎం పదవులు కల్పించాం. బాబు హయాంలో కార్పొరేషన్ చైర్మన్ పదవులు నాలుగు మాత్రమే ఇస్తే.. మా హయాంలో 15 మందికి చైర్మన్ పదవుల్ని కట్టబెట్టాం. 43 మంది ఎమ్మెల్సీలుంటే అందులో 22 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారు. దీన్ని అంబేద్కర్ గారి విజన్.. ఆలోచనగా ఎవరైనా చెబుతారు. మరి, బాబు హయాంలో ఎప్పుడైనా ఈ విధంగా పదవుల నియామకాలు జరిగాయా..? అని ప్రశ్నిస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువు, సీబీఎస్‌ఈ సిలబస్, ట్యాబ్‌ల పంపిణీ అనే మహత్తర ఆలోచన మా నాయకుడు జగన్ గారు తీసుకుని అమలు చేస్తుంటే.. గతంలో తనకెందుకు ఇలాంటి ఆలోచనలు రాలేదని చంద్రబాబు కుళ్లికుళ్లి ఏడవాలి కదా.. పేదలకు మంచి చేసే ముఖ్యమంత్రి కనుకనే, ఈరోజు మా నాయకుడు ‘నా ఎస్సీ’, ‘నా ఎస్టీ’, ‘నా బీసీ’, ‘నా మైనార్టీ’ అని దమ్ముగా చెబుతున్నాను. అంత దమ్ము గతంలో బాబుకు ఎందుకు లేదు..? అని నిలదీస్తున్నాం. పేదోళ్ల పెద్దబిడ్డ మా జగన్ గారుః నిన్న రిపబ్లికన్ టీవీలో బాబు మాట్లాడుతూ 2047 కల్లా పేదరికం లేని సమాజాన్ని తెస్తానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. అప్పటికి బాబు వయస్సు ఎంత ఉంటుంది..? ఆయన చెబుతున్న సమాజం ఆల్రెడీ ఇప్పటికే ఎదుగుతున్న మాట వాస్తవం కాదా..? పేదరికంలేని సమాజం కోసం మా నాయకుడు జగన్ గారు అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ సుమారు రూ. 2.8లక్షల కోట్లు పేదల మేలు కోసం పంపిణీ చేశారు. 2014 నుంచి 2019 వరకు బాబు ఎన్ని పథకాలు ఇచ్చారు..? మేమేమి చేశామనేది చర్చకు వస్తే తేలిపోద్ది. ఆయన ఎన్ని అబద్ధాలు ఆడినా.. దళితులెవరూ బాబును నమ్మరు. ఆయన వైపు దళితులు ఉన్నారనేది శుద్ధ అబద్ధం. బాబు, లోకేశ్ డీఎన్‌ఏలోనే లోపముందిః తండ్రేమో ‘ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా..?’ అని మాట్లాడుతాడు. ఆయన కొడుకేమో ‘దళితులు పీకిందేమీ లేదు’ అని అంటాడు. దీన్నిబట్టి దళితుల పట్ల వీరిద్దరూ ఇంత అహంకారంగా మాట్లాడుతున్నారంటే, వీళ్ల డీఎన్‌ఏలోనే ఎక్కడో లోపముందనిపిస్తుంది. బాబుకు తెలిసిన సామాజికన్యాయమంటే, పేదల్ని దోచి పెద్దలకు పెట్టడమే.. బాబులాంటి వెన్నుపోటుదార్లకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. అందుకే, ప్రజలు 2019లో కొట్టిన దెబ్బకు తండ్రీకొడుకులు పిచ్చికుక్కల్లా తిరుగుతున్నారు. అంబేద్కర్ ఆలోచనలు ముఖ్యంః బాబు అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ విద్యాదీవెన పథకం పెట్టాడు. మరి, దాన్ని అమలు చేయకుండా ఎందుకు తీసేశాడు..? బాబుకు దళితులంటే లీస్ట్ ప్రయారిటీ.. ఓట్లు కావాల్సిన సందర్భంలోనే బాబుకు దళితులు, అంబేద్కర్ గుర్తుకొస్తారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం పెడతానని గొప్పలు చెప్పుకున్న బాబు ఎందుకు పెట్టలేదు..? మరి, మా గౌరవ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు రూ.350 కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నారు. ఇప్పటికైనా బాబు దళితుల గురించి మాట్లాడేటప్పుడు వళ్లు దగ్గరబెట్టుకుని మాట్లాడాలి. రాజకీయాల కోసం అంబేద్కర్ పేరు చెప్పుకోవడం కాకుండా.. మా నాయకుడు జగన్ గారిలా ఆయన ఆలోచనా విధానాన్ని పాటించడం ముఖ్యమని బాబు నేర్చుకోవాలి.