చంద్రబాబును ప్రభుత్వ ఉద్యోగులు చీదరించుకుంటున్నారు

ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి
 

అసెంబ్లీ: చీఫ్‌ మార్షల్, అసెంబ్లీ భద్రతా సిబ్బందిపై చంద్రబాబు, ఆయన కొడుకు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని, ప్రభుత్వ ఉద్యోగులంతా తండ్రీకొడుకులను చీదరించుకుంటున్నారని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. ‘శుక్రవారం అసెంబ్లీ ముగిసిన తరువాత రెండ్రోజులు మా నియోజకవర్గానికి వెళ్తే చాలా ముఖ్యమైన విషయాలను ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చారు. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ అసెంబ్లీలో చీఫ్‌ మార్షల్, ఇతర భద్రతాసిబ్బందిపై చంద్రబాబు, ఆయన కొడుకు యూస్‌లెస్‌ ఫెల్, బాస్టడ్‌ అని తిట్టడం చాలా ఘోరం, ప్రభుత్వ ఉద్యోగులుగా అలాంటి వ్యక్తి కింద ఇంతకు ముందు పనిచేసినందుకు సిగ్గుపడుతున్నాం అని  ప్రభుత్వ ఉద్యోగులు మా దగ్గరకు వచ్చి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంతకుముందు చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. ఐదేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మస్థైర్యాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించడం బాధగా ఉందని చెప్పారు.

అదేవిధంగా ఎంతోమంది మహిళలు సీఎం వైయస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. దిశ చట్టం మాలో ధైర్యాన్ని నింపింది. రాబోయే రోజుల్లో మాకు మార్గదర్శకంగా నిలబడుతుందని మహిళలు సంతోషంతో చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ ఈ బిల్లును అసెంబ్లీలో పాస్‌ చేయడం రాష్ట్రంలోని ప్రతీ కుటుంబంలో సంతోషాన్ని నింపింది. ఢిల్లీ అసెంబ్లీలో సీఎం కేజ్రీవాల్‌ దిశ బిల్లుపై సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ బిల్లు కాపీలు ఢిల్లీకి పంపించండి వాటిని పరిశీలించి దాన్ని అనుసరిస్తామని అరవింద్‌ కేజ్రీవాల్‌ లేఖ రాశారు. వైయస్‌ జగన్‌ ఎలాంటి ఆలోచన చేస్తున్నారో ఇదొక నిదర్శనం’ అని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top