సభలో టీడీపీ ఎమ్మెల్యేల‌  రౌడీయిజం

శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
 

అమ‌రావ‌తి: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేస్తున్నార‌ని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి విమ‌ర్శించారు. మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడుతూ... టీడీపీ సభ్యులు సీఎం వైయ‌స్‌ జగన్‌ మాటలను వక్రీకరించి గందరగోళం సృష్టించేందుకు యత్నించారని విమర్శించారు.  సీఎం వైయ‌స్‌ జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు.యువకులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బిల్లు పెడితే టీడీపీ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. ఈ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని తాము ఖండిస్తున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలంటే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు గిట్టదని చెప్పారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ బడుగు, బలహీనవర్గాలకు మేలు చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.  

తాజా ఫోటోలు

Back to Top