సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి బాబుకు మూర్చరోగం

ఇంకొన్నాళ్లకు బాబు పిచ్చాస్పత్రికి వెళ్లాల్సిందే..

బాబు బ్రాండ్‌ ఇమేజ్‌ పోయి బ్యాండ్‌ ఇమేజ్‌ వచ్చింది

చంద్రబాబు చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయి అని ఎన్టీఆర్‌ చెప్పారు

ఐదేళ్లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని సింగపూర్‌లో దాచుకున్నాడు

బాబుపై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఫైర్‌

తాడేపల్లి: నాలుగు నెలల పాలనలోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చూసి చంద్రబాబు, ఆయన తాబేదారులకు మూర్చరోగం వచ్చిందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి, దేవినేని ఉమ మూర్చ రోగుల్లా, సైకోల్లా ప్రవర్తిస్తున్నారని, మీడియా ముందుకు వెళ్లినా.. పార్టీ కార్యకర్తల దగ్గరకు వెళ్లినా వారు మాట్లాడే భాషా, విచిత్ర వేషాలు చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబును చూసి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి భయపడేవారంట.. పిచ్చి ముదిరినట్లుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు. సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి మూర్చ వచ్చిందా..? భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వ్యక్తి నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది లేదు. నాలుగు లక్షల ఉద్యోగాల్లో కూడా 1.35 లక్షల ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేఒక్కసారి కల్పించిన గొప్ప చరిత్ర సీఎం వైయస్‌ జగన్‌ది. ఇది చూసి చంద్రబాబు మూర్చరోగిలా మారిపోయాడు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టుల్లో రిజర్వేషన్‌ కల్పిస్తూ మొదటి సభలో చట్టాన్ని చేశారు. ఇలాంటి నాయకుడిని చూసి చంద్రబాబు, ఆయన తాబేదారులకు మూర్చరోగం వచ్చింది. నామినేషన్‌ వర్కుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్‌ ఇచ్చేలాచట్టం తీసుకువచ్చారు. శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ మహిళలకు కల్పిస్తూ చట్టం చేశారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్‌ కల్పించిన గొప్ప వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌.
 
ఒక్క బటన్‌ నొక్కి లక్షా 73 వేల మంది ఆటో అన్నలకు అకౌంట్లలో ఒక గంటలో రూ. 10 వేలు వేశారు. కులం, మతం, పార్టీ ఏమీ చూడలేదు. పేదవాడి గుండె చప్పుడు చూసి చెప్పిన మాట చెప్పినట్లు నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. అక్టోబర్‌ 15వ తేదీన 60 లక్షల రైతు కుటుంబాలకు నేరుగా రైతు భరోసా రూ.8750 కోట్లు వారి అకౌంట్లకు వెళ్తున్నాయి. ఇవి చూసి మూర్చరోగుల్లా కొటుకుంటున్నారా..? 

సీఎం వైయస్‌ జగన్‌ దశలవారి మద్య నిషేధంలో భాగంగా మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించారు. దాన్ని అభినందించకుండా చంద్రబాబు సిగ్గుమాలిన చేష్టలు చేస్తున్నాడు. మద్యం దుకాణాలు తగ్గించడం నేరమా..? మద్యం 24 గంటలు విక్రయించాలా..? మద్యపానాన్ని నిషేధించాలి. కుటుంబాలు సంతోషంగా ఉండాలని సీఎం పనిచేస్తుంటే.. చంద్రబాబు అండ్‌ కో మూర్చరోగుల్లా ప్రవర్తిస్తున్నారు. 

చంద్రబాబు బ్రాండ్‌ ఇమేజ్‌ పోయి బ్యాండ్‌ ఇమేజ్‌ వచ్చింది. అధికారంలో ఉన్న ఐదేళ్లు మార్కెటింగ్‌ చేసుకొని దోచుకొని సింగపూర్‌లో దాచుకోవడం తప్ప చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారు. చంద్రబాబు చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయి అని ఆయనకు పిల్లనిచ్చిన మామ నందమూరి తారక రామారావు ఆ రోజునే చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకొని నువ్వు మాట్లాడుతావా..? అవినీతిని తరిమేస్తున్నాం. నీతిగా, నిజాయితీగా సీఎం పాలన చేస్తున్నారు. తప్పు చేస్తే ఎంతటివారినైనా శిక్షించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాలుగు నెలల పాలన చూసి మూర్చరోగం వచ్చిన చంద్రబాబు.. ఇంకో నాలుగు నెలల్లో బాబు, ఆ పార్టీ పిచ్చి ఆస్పత్రికి వెళ్లాల్సిందేనని ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top