ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌ ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతాం

నాడు – నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌

అసెంబ్లీ: చంద్రబాబు హయాంలో చీమలు కుట్టి, ఎలుకలు కొరికి పసికందులు మరణించే స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు కొరికి ఒక పసికందు మరణం.. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చీమలు కుట్టి పసికందు మరణాలు చూశాం. ఇటువంటి పరిస్థితులు సృష్టించిన ప్రతిపక్షానికి సభలో ప్రభుత్వ ఆస్పత్రుల గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాం.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌ ఆస్పత్రులుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్‌ చెప్పారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top