ద‌శాబ్దాల క‌ల నెర‌వేర్చిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే హ‌ఫీజ్‌ఖాన్‌

క‌ర్నూలు: ఆరు ద‌శాబ్దాల క‌ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చొర‌వ‌తో నెర‌వేరింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. మూడు రాజ‌ధానుల బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెల‌ప‌డంతో క‌ర్నూలులో ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కర్నూలును న్యాయ రాజధానిగా ఎంపిక చేసిన సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే హ‌ఫీజ్‌ఖాన్‌ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం వైయ‌స్‌ జగన్‌ లక్ష్యమన్నారు.  కర్నూలులో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నామన్నారు. న్యాయ రాజధాని కర్నూలుకు రావాలన్నది మా కలఅని, ఆరు దశాబ్దాల కల ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు. ద‌శాబ్దాల కలను నెరవేర్చిన సీఎం వైయ‌స్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top