మైనారిటీలకు రిజర్వేషన్‌ కల్పించిన ఘనత వైయస్‌ఆర్‌దే

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌
 

అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీలకు ఎప్పుడు అండగా ఉందని చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిదే అని కర్నూలు నగర ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌ తెలిపారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. బడ్జెట్‌లో మైనారిటీలకు పెద్ద పీట వేశారని తెలిపారు. ముస్లింలు అన్నివర్గాల కంటే వెనుకబడి ఉన్నారని, అందరికంటే దయనీయంగా బతుకుతున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని సచార కమిటీ కూడా నిర్ధారించిందన్నారు. చదువు ఒక్కటే పేదరికాన్ని దూరం చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చదువుకు దూరంగా ఉన్న వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం కాగానే రాజన్న బడిబాట, అమ్మ ఒడి పథకాలు ప్రవేశపెట్టడంతో డ్రాపౌట్స్‌ తగ్గించామన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివారన్నారు.

సొంతంగా ఇల్లు ఉండాలన్నది పేదవారి కల. ఆ కల నెరవేర్చేందుకు వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ గృహ నిర్మాణపథకాన్ని ప్రవేశపెడుతున్నారన్నారు. ముస్లింల కష్టాలను పాదయాత్రలో వైయస్‌ జగన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు కాబట్టే అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఉగాదిలోగా 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తామనడం చరిత్రలో ఇదే ప్రథమమన్నారు. ఆడవాళ్ల పేరు మీదుగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని, దానిపై పేదలకు పూర్తిగా అధికారం ఉంటుందన్నారు. పింఛన్లు రూ.2,250 ఇవ్వడంతో 66 లక్షల మంది ఆనందంగా ఉన్నారని వివరించారు. డయాలసిస్‌ పేషెంట్లకు రూ.10 వేలు పింఛన్‌ పెంచడంతో ఆ కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.

వైయస్‌ఆర్‌ బీమా పథకం బాధిత కుటుంబం అండగా ఉంటుందన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని గత ప్రభుత్వం మొండి చూపిందని విమర్శించారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా రైతులకు రూ.12,500 ఇస్తామనడం గొప్ప విషయమన్నారు. వ్యవసాయానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేశారని వివరించారు. మౌజమ్‌లకు గౌరవవేతనం పెంచడం శుభ పరిణామమని చెప్పారు. మైనారిటీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పారు. నారా హమారా కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టి హింసించారని, నంద్యాల ఉప ఎన్నికల్లో మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదన్నారు. ముస్లింలకు టీడీపీలో ప్రాధాన్యత లేదన్నారు. 
 
 

Back to Top