రాయలసీమ అభివృద్ధి చెందకూడదా?

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌
 

తాడేపల్లి: రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందకూడదా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ చంద్రబాబును ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ రాజధానుల ప్రకటనను ఆయన స్వాగతించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 కన్న ముందు సమైక్యాంధ్ర కావాలని ఉద్యమం నడుస్తున్నప్పుడు కర్నూలు జిల్లాలో 365 రోజులు ధర్నాలు, దీక్షలు చేశారు. లక్షాలాది మంది విద్యార్థులు పోరాటం చేశారు. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్‌ నగరాన్ని కోల్పోతామని బాధపడ్డారు. మొదట కర్నూలు రాష్ట్రరాజధానిగా ఉండేది. అక్కడే అన్ని కార్యాలయాలు మూడేళ్ల పాటు ఉండేవి. రాజధాని అక్కడి నుంచి హైదరాబాద్‌ తరలిపోయినప్పుడు మేం పడిన బాధ అంతా ఇంతా కాదు. వైయస్‌ జగన్‌ ప్రజల నాడీ తెలుసుకున్నారు. ప్రభుత్వంతో ఎలాంటి సహకారం అందించాలని భావించిన వైయస్‌ జగన్‌ కర్నూలును జ్యుడిషియల్‌ రాజధానిగా చేస్తున్నారు. చంద్రబాబు రాయలసీమను గుండాలు, ఫ్యాక్షనిస్టులు అంటూ చిత్రీకరించారు. మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదా? రైతులు మంచిగా పంటలు పండించుకోకూడదా? మాకు ఉద్యోగాలు అవసరం లేదా? అన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కర్నూలుకు చంద్రబాబు 2014 ఆగస్టు 15న వచ్చారు. స్వాంతంత్ర్య వేడుకల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. 

Back to Top