అన్ని ప్రాంతాలను అభివృద్ధే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం

విశాఖ: అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలని బీసీజీ నివేదిక ఇచ్చిందన్నారు. విశాఖలో శనివారం అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని గతంలో శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీలు చెప్పాయని గుర్తు చేశారు. పరిపాలన, అభివృద్ధి ఒక చోట జరగడంతోనే మనం నష్టపోయామన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. చంద్రబాబు మాత్రం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలకు నీళ్లు, నిధులు, పరిపాలన ఇవ్వాలన్నదే మా లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. మరో లక్ష కోట్లు తెచ్చి అమరావతిలోనే పెడితే..మిగిలిన ప్రాంతాలు ఏమైపోవాలన్నారు. చంద్రబాబు తీరును ఏ ప్రాంత ప్రజలు హర్షించడం లేదన్నారు. భూముల రేట్లు తగ్గుతున్నాయని చేసే వాటిని ఉద్యమం అంటారా అని ప్రశ్నించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే చంద్రబాబు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. రాజధాని రైతులకు తప్పకుండా సీఎం వైయస్‌ జగన్‌ న్యాయం చేస్తారని చెప్పారు.
పవన్‌ కళ్యాణ్‌ పూటకో మాట మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఐగడం మానేసి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.

Back to Top