శవాల వేటలో చంద్రబాబు

విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు మంచి నిర్ణయం

సీఆర్‌డీఏ అంటే.. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ అథారిటీ

విశాఖకు అన్ని కనెక్టివిటీలు ఉన్నాయి

ఉత్తి ఆంధ్రాను..వైయస్‌ జగన్‌ ఉత్తమ ఆంధ్రాగా తీర్చిదిద్దుతారు
 

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అవుతాయేమోనని ప్రకటన చేసినప్పటి నుంచి చంద్రబాబు శవాల వేటలో ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని సీఎం ప్రకటన చేయడంతో మూడు ప్రాంతాల్లో పండుగ వాతవరణం నెలకొందన్నారు. అనుభవం ఉందని చంద్రబాబును గెలిపిస్తే రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో అమరావతిలో ఏ నిర్మాణం తలపెట్టలేదని మండిపడ్డారు. గత ఐదేళ్లు విభజన కష్టాలను అనుభవించామని చెప్పారు. విశాఖలో గురువారం గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు.  సీఆర్‌డీఏ అంటే చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ అథారిటీగా మార్చారు. రాజధాని పేరుతో ప్రజాధనాన్ని దోచేశారని మండిపడ్డారు. 

అమరావతిలో అభివృద్ధి ఏ రకంగా ఉందో ప్రజలనే అడుగుతున్నాం. ఆయన పుత్రరత్నం మంగళగిరిలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. దాదాపు 55 వేల ఎకరాలు కోర్‌ క్యాపిటల్‌గా తీసుకున్నారు. ఒక్కో ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందుకు లక్ష కోట్లు పెట్టుబడులు అవసరమవుతాయి. ఇందుకు ఇప్పటి వరకు చంద్రబాబు ఖర్చు చేసింది కేవలం రూ.5 వేల కోట్లు. అభివృద్ధికి ఖర్చు చేసింది అరకొరనే. రైతులను మోసం చేసేందుకు సింగపూర్ యాత్రలు చేశారు. చంద్రబాబు ఏ దేశం వెళ్తే  అలాంటి ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. సింగపూర్‌, మలేషియా, దుబాయి అన్నారు. ఏదీ చేయలేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఆ దేశాల మాదిరిగా తయారు కావాలని కోరుకోవడం లేదు. మన రాష్ట్రాన్ని చూసి మిగిలిన దేశాలు, రాష్ట్రాలు ఇటువంటి రాష్ట్రంగా మేం తయారు కావాలనే అభిప్రాయంతో ఐదు కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని కోసం చేసిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కోసం హెరిటేజ్‌ సంస్థ, నారాయణ సంస్థలు, సీఎం రమేష్, సుజనాచౌదరి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న టీడీపీ నాయకులు భూములు కొన్నారు. చంద్రబాబు అనుచరులు దాదాపు 4 వేల ఎకరాలు కొన్నారు. ఏ ఉద్దేశం కొన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ప్రజల తాలుకా ఆకాంక్షలతో రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తామని, ఏ రకమైన విషయాలను బయటకు చెప్పమని ప్రమాణం చేస్తాం. అలాంటి ప్రమాణానికి గౌరవం ఇవ్వకుండా చంద్రబాబు రాజధ్రోహం చేశారు. రాష్ట్ర ప్రజలు ఓ నమ్మకంతో వైయస్‌ జగన్‌కు ఒక అవకాశం ఇచ్చారు. వారి ఆశయాలను, ఆలోచనకు అనుగుణంగా రాజధానిపై వైయస్ జగన్‌ ఒక కమిటీ వేశారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలు, మనోభావాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ సభలో ఆలోచన చేశారు.

రాష్ట్రంలో విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఉండాలని తన ఆలోచనను సీఎం చెప్పారు. ఇందులో తప్పేముంది? వైయస్‌ జగన్‌ ప్రకటనతో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు గత రెండు రోజులుగా పండగ చేసుకుంటున్నారు. రాయలసీమ ప్రజలు తమ ప్రాంతానికి జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ వస్తే బాగుంటుందని సంబరాలు చేసుకుంటున్నారు. అమరావతి లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా ఉందని ఆనందపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణ ఉంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. విశాఖ నగరం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేసేందుకు అనువైన ప్రాంతమని సీఎం సభలో చెప్పారు. రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చేయాలంటే మరో లక్ష కోట్లు అవసరం ఉంది. ఏమీ లేని ప్రాంతంలో లక్ష కోట్లు పెట్టుబడి పెట్టేకంటే, వంద, రెండు వందల కోట్ల విలువైన విశాఖ నగరంలో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మాణం చేపట్టిన బీఆర్‌టీఎస్‌ రోడ్లు విశాఖ చుట్టూ ఉన్నాయి. అనకాపల్లి-ఆనందపురం నేషనల్‌ హైవే పూర్తి అయితే నగరంలో ఉన్న జాతీయ రహదారి మన పరిధిలోకి వస్తుంది. బ్రహ్మండమైన సాంప్రదాయాలు, సంస్కృతులు, అన్ని రంగాల ప్రజలు విశాఖలో ఉన్నారు.

దేశంలోనే వన్‌టౌన్‌లో ఓ కొండ మీదే మసీదు, చర్చీ, ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఏ రోజు కూడా ఇక్కడ మత, కుల ఘర్షణలు జరగలేదు. ఈ రోజు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వస్తే మన జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. బ్రహ్మండమైన రోడ్డు కనెక్ట్‌విటీ, రైల్వే లైన్‌,  సముద్రతీరం ఉంది. రెండు పోర్టులు ఉన్నాయి. జాతీయ ఏయిర్‌పోర్ట్‌ ఉంది. విశాఖకు ఓ గుర్తింపు ఉంది. విశాఖ నగరాన్ని వెంచర్‌ క్యాపిటల్‌, సమ్మర్‌ క్యాపిటల్‌ చేయాలని గతంలో సీఎం వైయస్‌ జగన్‌ను కోరారు. వైయస్‌ జగన్‌ ఆలోచన ఈ ప్రాంత ప్రజలకు సంతోషాన్నిచ్చారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది పాలకులు ఉన్నా వివక్షకు గురవుతున్న ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు. వైయస్‌ఆర్‌ చేసిన అభివృద్ధి తప్ప..వేరే నాయకులు చేసింది ఏమీ లేదు. ఇన్నాళ్లు ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగా మిగిలిపోయింది..ఇలాంటి ఉత్తి ఆంధ్రాను రాబోయే కాలంలో వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఉత్తమ ఆంధ్రాగా తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉంది. గతంలో 2014లో విజయమ్మ విశాఖలో పోటీ చేసినప్పుడు రౌడీరాజ్యం వస్తుందని, విజయమ్మ గెలిస్తే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి పోతుందని తప్పుడు ప్రచారం చేశారు. అటువంటి విశాఖకు ఈ రోజు మంచి రోజులు తీసుకురాబోతున్నారు. వైయస్‌ జగన్‌ను ఈ ప్రాంత ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు.

ఈ రోజు చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్‌ అయిన పవన్‌కు రాజకీయ పార్టీలు నడిపే నైతిక హక్కును కోల్పోయారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తే..మీరు ఒక ప్రాంత అభివృద్ధిని, ఒక వర్గ అభివృద్ధినే ప్రోత్సహిస్తామని మీరు అభిప్రాయం పడుతున్నారు. మీరు రాజకీయ పార్టీలు నడిపే హక్కు ఉందో లేదో మీ మనసాక్షికే వదిలేస్తున్నాం. గత ఆరు నెలల్లో టీడీపీ చేసిన శవ రాజకీయాలు చూశాం. గతంలో ఎవరో చనిపోతే ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని శవ రాజకీయాలు చూశాం. మొన్న ఓ పెద్దాయన ఆరోగ్యం బాగలేక చనిపోతే..లేదు..మీకు డబ్బులు ఇస్తామని శవంతో రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా చంద్రబాబు శవాల వేటలో ఉన్నారు. ఎక్కడైనా శవం దొరికితే రాజకీయాలు చేయవచ్చని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేతలనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, అభివృద్ధికి అడ్డుపడితే గుణపాఠం తప్పదని అమర్‌నాథ్‌ హెచ్చరించారు.

Back to Top