విశాఖ ఎమ్మెల్యేల‌పై ఎల్లో మీడియా దుష్ప్ర‌చారం

 వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి గుడివాడ అమర్నాథ్
 

 
విశాఖ‌:  విశాఖ ఎమ్మెల్యేల‌పై ఎల్లో మీడియా దుష్ప్ర‌చారం చేస్తుంద‌ని  వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి గుడివాడ అమర్నాథ్ మండిప‌డ్డారు. ఎల్లోమీడియాలో వచ్చిన క‌థ‌నాల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. శుక్ర‌వారం గుడివాడ అమ‌ర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానానికి, ఎమ్మెల్యేలకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్ప‌ష్టం చేశారు. అనకాపల్లిలో 'నాడు నేడు' కార్యక్రమం సక్రమంగా జరగాలనే తాను అన్నానని... తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారని అన్నారు. సీఎం వైయ‌స్ జగన్ నుంచి తమకు అసలు పిలుపే రాలేదని.. తాము అమరావతికి వెళ్లనే లేదని... ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వార్తలు రాశారని ధ్వ‌జ‌మెత్తారు.  ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ మాట్లాడుతూ..సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో కొత్త జిల్లాల ఏర్పాటు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై స‌మీక్షించిన‌ట్లు చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top