అక్రమాలకు అన్నదమ్ములు.. చంద్రబాబు, సబ్బం హరి

రూ.3 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిన సబ్బం హరి 

విశాఖలో ఒక సెంట్‌ భూమి కూడా కబ్జా కానివ్వం

దోపిడీలు, అక్రమాల్లో సీనియార్టీని బట్టి టీడీపీలో పదవులు

సీఎం వైయస్‌ జగన్, విజయసాయిరెడ్డిలను విమర్శించే స్థాయి సబ్బం హరికి లేదు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

విశాఖపట్నం: ‘అక్రమాలకు చంద్రబాబు అన్నయ్య అయితే.. సబ్బం హరి తమ్ముడు’ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. సబ్బం హరి పొలిటికల్‌ బ్రోకర్‌ అని దుయ్యబట్టారు. అక్రమంగా ప్రభుత్వ భూములు దోచేస్తే చూస్తూ ఊరుకోవాలా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలను విమర్శించే స్థాయి సబ్బం హరికి లేదని, ఇకనైనా భాష మార్చుకోవాలని అమర్‌నాథ్‌ హెచ్చరించారు.  విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 

‘రూ.3 కోట్ల విలువైన భూమిని సబ్బం హరి కబ్జా చేశారు. అధికారులు అనేక సార్లు నోటీసులు ఇచ్చినా సబ్బం హరి స్పందించలేదు. ఆయన నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు అంటించారు. అక్రమంగా భూములు దోచేస్తే చూస్తూ ఊరుకోవాలా? విశాఖలో ఒక సెంట్‌ భూమి కూడా కబ్జా కానివ్వం. ప్రభుత్వ భూములను అక్రమదారుల చేతుల్లోకి వెళ్లనివ్వమని చాలా సార్లు చెప్పాం. చంద్రబాబు అధికారంలో ఉండగానే విశాఖలో భారీ భూ స్కామ్‌ జరిగింది. విశాఖలో భూ స్కామ్‌లు జరిగాయని టీడీపీ నేతలే ఆరోపించారు. విశాఖలో ప్రభుత్వ భూములను కాపాడతాం.

చంద్రబాబు బ్యాక్‌ డోర్‌ పొలిటిషియన్, సబ్బంహరి బ్లాక్‌మెయిల్‌ పొలిటిషియన్‌. సబ్బం హరి 213 గజాలు ఆక్రమిస్తే తప్పులేదు.. అధికారులు తొలగిస్తే తప్పని చంద్రబాబు అండ్‌ కో అంటున్నారు. 200 గజాలు కాదు కదా.. 2 గజాలు కూడా కబ్జా కానివ్వం. దోపిడీలు, అక్రమాల్లో సీనియార్టీని బట్టి టీడీపీలో పదవులు ఇస్తారు. హత్యకేసులో నిందితుడు రవీంద్రకు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే, ఈఎస్‌ఐ స్కామ్‌లో కార్మికుల సొమ్ము మింగేసిన అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. దోపిడీలు, అక్రమాల్లో సీనియార్టీని బట్టి టీడీపీలో పదవులు ఇస్తారు. విశాఖ ప్రజలు సబ్బం హరికి రాజకీయ భిక్ష ఇస్తే.. వారిని మోసం చేశాడు. తప్పు చేస్తే మాజీ ఎంపీ అయినా.. మేయర్‌ అయినా తమకు ఒకటే’నని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top