వైయ‌స్ జ‌గ‌న్ గొప్ప రాజ‌కీయ సంస్క‌ర్త 

ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
 

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చారిత్రాత్మ‌క బిల్లులు ప్ర‌వేశ‌పెట్టి గొప్ప రాజ‌కీయ సంస్క‌ర్త‌గా మారార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కొనియాడారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియా పాయింట్‌లో మాట్లాడారు. గ‌త ప్ర‌భుత్వంలో ఐదు సంవ‌త్స‌రాలు వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో సుమారు రెండు ల‌క్ష‌ల ప‌ర్మినెంట్ ఉద్యోగాల‌ను తీసేసారు. ఎక్క‌డ‌ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మ‌హిళ‌లు ఉద్యోగాల్లోకి వ‌స్తారో అని వారిని రానీయ‌కుండా ఔట్ సోర్సింగ్ పేరు మీద ప్ర‌భుత్వం న‌డిపిన పెద్ద‌మ‌నిషి చంద్ర‌బాబు.
వీళ్ల ర‌భ‌స అంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మ‌హిళ‌లు పైకి రాకూడ‌ద‌ని బాగుప‌డ‌కూడ‌ద‌ని. రాష్ట్రంలో వారు అణ‌గారిన స్థితిలో ఉండాల‌ని ఇలా గొడ‌వ చేస్తున్నారు. అధికారం చేపట్టి రెండు నెలలు కూడా కాలేదు ఒక్క పెన్ను గీత‌తో ల‌క్షా ముఫై మూడువేల నాలుగ‌వంద‌ల తొంభై నాలుగు ఉద్యోగాలు ఇచ్చిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ది అన్నారు.
50శాతం నామినేటటెడ్ ప‌ద‌వులు, కాంట్రాక్టుల్లో దామాషా ప్ర‌కారం రిజ‌ర్వ‌ష‌న్ అన్ని వ‌ర్గాల‌కూ అవకాశం క‌ల్పించాల‌నుకుంటున్నారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్. గొప్ప మాన‌వ‌తావాదిగా, రాజ‌కీయ సంస్క‌ర్త‌గా, గొప్ప స్టేట్స్ మెన్ గా ఆయ‌న నిర్ణ‌యాలు అన్నీ ఉన్నాయి. 
ఉద్యోగుల‌కు డిఎ కూడా ఇవ్వ‌ని మ‌న‌సులేని మ‌నిషి చంద్ర‌బాబు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను చిన్న చూపు చూసాడు. ఎంతో మంద‌ని స‌స్పెండ్ చేసాడు. ద‌ళితుల‌ను ఏసీబీ కేసులు పెట్టి వేధించాడు. అందుకే బాబుకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మ‌హిళ‌లు త‌గిన శాస్తి చేసారు. వారికి ఏమీ చేయ‌కుండా చ‌రిత్ర హీనుడుగా మిగిలాడు చంద్ర‌బాబు. 
నేడు ఎంతో ముఖ్య‌మైన బిల్లును, చ‌రిత్రను మార్చే బిల్లును ప్ర‌వేశ పెడుతుంటే అడ్డుత‌గిలి బిసి ఎస్సీలు ఎస్టీల‌కు ద్రోహం చేస్తున్నారు
సుమారు రెండు కోట్ల మంది బీసీలు ఎస్సీలు చంద్ర‌బాబును వ‌చ్చే రోజుల్లో డిపాజిట్లు రాకుండా చేస్తారు.
ఏ ముఖ్య‌మంత్రి చరిత్ర‌లో చేయ‌న‌ట్టుగా మా ముఖ్య‌మంత్రి గొప్ప చారిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నారు. నాలుగు ల‌క్ష‌ల మందికి పంచాయితీల్లో ఉద్యోగాలు క‌ల్పించారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు ఇంత‌కంటే ఏమి కావాలి? కాంట్రాక్టులు, నామినేటెడ్ ప‌ద‌వుల్లో ద‌ళితులు బీసీల‌కు ఇస్తే సామాజిక‌, ఆర్థీక‌, రాజ‌కీయ సాధికార‌త సాధిస్తారు. అదే జ‌రిగితే తెలుగుదేశం డోర్సు క్లోజ్ చేసుకునే ప‌రిస్థితి త్వ‌ర‌లో వ‌స్తుంది. 
 

తాజా వీడియోలు

Back to Top