గవర్నర్‌ ప్రసంగంలో అన్ని అవాస్తవాలే

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

గవర్నర్‌ చేత అసెంబ్లీలో అబద్ధాలు చెప్పించారు

రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదు

స్పీకర్‌ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారు

55 శాతం ఆర్థికవృద్ధి పెరిగినట్లు అబద్ధాలు చెప్పారు

నవరత్నాలను దొంగలించి కాపీ కొట్టి గవర్నర్‌తో చెప్పించారు

ఏపీ చరిత్రలో రికార్డు స్థాయిలో టీడీపీ దోపిడీ

హైదరాబాద్‌: చంద్రబాబు అన్ని విషయాల్లో మోసం, దగాకు పాల్పడ్డారని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఇవాళ గవర్నర్‌ ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెప్పించారని, అన్ని అవాస్తవాలేనని ఆయన ధ్వజమెత్తారు. గవర్నర్‌ ప్రసంగంలోని అంశాలను శ్రీకాంత్‌రెడ్డి మీడియాకు వివరించారు.  జపాన్, సింగపూర్‌ కన్న గొప్పగా ఏపీ అభివృద్ధి చెందినట్లు గవర్నర్‌ చేత అబద్ధాల కరపత్రాలను చంద్రబాబు చదివించడం దురదృష్టకరమన్నారు. ఇది వినాల్సి రావడం ఏపీ ప్రజల దురదృష్టకరమన్నారు.
ఎన్‌టీఆర్‌ ఎప్పుడో చెప్పిన డైలాగ్‌ ‘‘సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు’’ గవర్నర్‌తో చెప్పించారన్నారు. నిజంగా సమాజమే దేవాలయమైతే..అసెంబ్లీ మీ ఉద్దేశంలో దయ్యాల కొంపనా అని ప్రశ్నించారు. రాజ్యంగంలో ఉన్నదాన్ని ఉల్లంఘించి 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకొని నలుగురుని మంత్రులుగా కొనసాగిస్తున్న దాన్ని దయ్యాల కొంప అనుకోవాల్సిందే అన్నారు. రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసం లేకుండా, రాజ్యాంగాన్ని చులకనగా చూసే చంద్రబాబు మరోపక్కన ఉండి గవర్నర్‌ ప్రసంగాన్ని చదవడం అసహ్యంగా ఉందన్నారు. రాజ్యంగంలోని విలువలను కాపాడనప్పుడు, అందులోని అంశాలను తుంగలో తొక్కుతున్న స్పీకర్‌ను ఏమనాలని ఆయన ప్రశ్నించారు. స్పీకర్‌ చక్కగా డ్రామా నడిపిస్తున్నారని, పదే పదే ఫోన్లు చేసి ప్రతిపక్షాన్ని ఆహ్వానిస్తున్నానని డ్రామాలాడుతున్నారని వ్యాఖ్యానించారు. మేం మొదటి నుంచి కూడా ఒక్కటే చెబుతున్నామని..రాజ్యాంగ విరుద్ధంగా కొనుగోలు చేసిన 23 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే అదే గంటలో మేం అసెంబ్లీకి వస్తామని తెలిపారు. రాజకీయ కోణం పక్కన పెట్టి..రాజ్యాంగంలో పొందుపరిచిన వాటిని పరిశీలన చేయమంటే స్పీకర్‌ స్పందించడం లేదన్నారు. ఈ రోజు  ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలకు ఆమోదం తెలిపిన స్పీకర్‌కు ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు మేం లేఖలు ఇస్తే పట్టించుకోలేదన్నారు. వారిపై చర్యలు తీసుకొని స్పీకర్‌కు రాజ్యాంగంపై, అసెంబ్లీపై ఎలాంటి విశ్వాసం ఉందో అర్థమవుతుందన్నారు. ఇటువంటి స్పీకర్‌ తన పోస్టుకు విలువ ఇవ్వకుండా పార్టీ కండువా వేసుకొని పార్టీ మీటింగ్స్‌లో మాట్లాడుతూ..సీఎంను పొగడ్తలతో ముంచుతున్నారన్నారు.
గవర్నర్‌ ప్రసంగంలోని రెండో అంశం పరిశీలిస్తే..రాష్ట్ర విభజన, హామీలు పదే పదే చెబుతుంటారన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్‌ పార్టీ అయితే, సమస్యను పరిష్కరించాల్సింది ఎన్‌డీఏ ప్రభుత్వం అన్నారు. నాలుగేళ్లు ఎన్‌డీఏలో కొనసాగిన చంద్రబాబుకు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో lజత కడుతున్నారన్నారు. ఎప్పుడు ఒకరిని టార్గెట్‌ చేసి చంద్రబాబు మాట్లాడుతుంటారన్నారు. సమస్యను పరిష్కారం కాకుండా ప్రత్యేక హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అన్నది చంద్రబాబు కాదా అని నిలదీశారు. 
వృద్ధిరేటు గురించి గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొన్నారన్నారు. దేశ వృద్ధి రేటు 7.3 ఉంటే రాష్ట్రంలోని వృద్ధి రేటు 10.66 ఉందని గవర్నర్‌తో చెప్పించారన్నారు. దేశం కంటే ఎక్కువ వృద్ధి రేటు అంటున్న చంద్రబాబు మాటలు పరిశీలిస్తే..రాష్ట్రంలో 55 శాతం పైగా ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉండాలన్నారు. 55 శాతం వృద్ధి రేటు పెరిగినట్లు ఏ గ్రామంలోనైనా రుజువు చేయగలరా అని సవాలు విసిరారు. గవర్నర్‌ ప్రసంగం అంతా కూడా అబద్ధాలే అన్నారు.
గవర్నర్‌ ప్రసంగంలోని 69వ పాయింట్‌ పరిశీలిస్తే..మ్యానుఫ్యాక్చరింగ్‌ దేశవ్యాప్తంగా 16.7 ఉండగా ఏపీలో 9.66 ఉందని చెప్పారని, అంత వెనుకబాటుతనం ఉన్న మనం, సర్వీస్‌ సెక్టార్‌లో జాతీయ స్థాయిలో 54 శాతం ఉంటే, ఏపీలో 44 శాతమే ఉందని చెప్పారన్నారు. ఎక్కడైనా అభివృద్ధి చెందాలంటే అటు తయారీ రంగం, ఇటు సేవా రంగంలో వృద్ధి రేటు ఉండాలన్నారు. మన రాష్ట్రంలో ఈ రెండింటిలో తక్కువే ఉన్నామన్నారు. వ్యవసాయ రంగంలో కూడా ఆహార ఉత్పత్తులు గతంలో కంటే కూడా బాగా తగ్గాయన్నారు. హార్టికల్చర్‌లో కూడా లేదన్నారు. చేపల రంగంలో ఉందని చెప్పారన్నారు. వ్యవసాయాన్ని సర్వ నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఈ మూడు రంగాల్లో లేకుండా అభివృద్ధిలో ఎక్కడో ఉన్నామని అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు. తన చుట్టు ఉన్న ప్రజల అభివృద్ధి కోరుకోవాలని కానీ, ఎక్కడో నక్షత్రాల్లో అభివృద్ధి అంటూ కల్లిబొల్లిమాటలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. అభివృద్ధిలో 2024, 2050 అంటూ హెలెన్‌ కెల్లర్‌ కొటేషన్లు కూడా పొందుపరిచారన్నారు. ఐదేళ్లలో విఫలమై..ఇప్పుడు 2050 విజన్‌ అంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతిరహితంగా ఏపీ పాలన ఉందని చెప్పించడం సిగ్గుచేటు అన్నారు. చరిత్రలో ఈ ఐదేళ్లలో బడ్జెట్‌ కేటాయింపుల కంటే ఎక్కువగా దోపిడీ చేశారన్నారు. ఏపీ సంపదను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్రికా దేశాల్లో కూడా ఇంతటి ఘోరమైన దోపిడీ ఉండదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలు కాపీ కొట్టి గొప్పగా గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించారన్నారు. కాపులను వంచించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాపులను మభ్యపెడుతున్నారన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో చంద్రబాబు మొదటి సంతకాల ఊసే లేదన్నారు. 
 

Back to Top