ప‌రిస‌రాల శుభ్ర‌త‌తో ఆరోగ్యం

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

శ్రీ‌కాకుళం: ప‌రిస‌రాల శుభ్ర‌త‌తో ఆరోగ్య‌వంతంగా జీవించ‌వ‌చ్చు అని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. కాలానుగుణంగా ప్రతి పౌరుడు చైతన్యం కావాలని గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం సాకారం అవుతుంద‌న్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం రూరల్ మండలం బైరి గ్రామంలో తెడిచెత్త, పొడి చెత్త సేకరణ ట్రై సైకిల్స్ ప్రారంభించారు, ప్రతిఒక్కరికీ డస్టుబిన్స్ అందజేశారు.  ఫాగ్గింగ్ మెషిన్ లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధ‌ర్మాన‌ మాట్లాడుతూ.. గత 100 సంవత్సరాల క్రితం బైరి గ్రామంలో 250మంది పౌరులు నివాసం ఉండేవారని నేడు ఆ సంఖ్య 2500 వరుకు పెరిగిపోయిందని, ప్రతిఒక్కరూ అవసరాలు పెరిగిన నేపథ్యంలో ప్రతిఒక్కరూ చెత్తను బయట పారివెయ్యకుండా చెత్త సేకరణకు వచ్చే వాహనాలకు అందించాలని సూచించారు. నేడు డెంగ్యూ, మలేరియా, కరోనా, ఓమిక్రాన్ వంటి అనారోగ్యాలకు గురి చేసే ఎన్నో వైరస్ లు వస్తున్నాయని అన్నారు. గతంలో ఉన్న ఆహార అలవాట్లు అన్ని మారిపోయాని,ప్రతి ఇంటికి కల్లాపు వేసి పసుపు తోరణాలతో ద్వారబంధాలను సిద్ధం చేసేవారని నేటి యాంత్రిక యూగంలో అవన్నీ మరిపోయాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణం ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్లు బాధ్యతగా భావించాలని, ప్రతిఒక్క గ్రామంలో టాయిలెట్స్ నిర్మాణం జరగాలని ఇందుకోసం రూ. 3 లక్షలు నిధులు ప్రభుత్వం సమకూర్చుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ధర్మాన కోరారు. తన చేతిలో ఆర్థిక వెసులుబాటు కలిగిన సమయంలో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణంకి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు ప్రభుత్వం భూములు మాయం అయిపోయాయని, కొన్ని భూములు స్థానిక అవసరాలకు వినియోగించగా, కొన్ని కబ్జాలకు గురైయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. సచివాలయం పరిధిలో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణం సాధ్యం కాకపోతే ప్రజాప్రతినిధుల కోరిక మేరకు స్థానికులు అవసరాలకు ఉపయోగపడేలా వీటి నిర్మాణం చేపట్టాలని ధర్మాన సూచించారు. మనమే మన ఇంట్లోకి అనారోగ్యం తెచ్చుకుంటున్నామని ఇప్పటికైనా పౌరులు చైతన్యవంతం కావాలని తెడిచెత్త పొడి చెత్త వేరు చేసి వాహనాలకు అందించడం ద్వారా చెత్తనుంచి సంపద తయారు చేసే కేంద్రాలకు తరలించి వాటిని తిరిగి రీ సైకిల్ చేస్తారని, వీటి ద్వారా కొన్ని గ్రామ పంచాయతీలకు ఆర్ధిక పరిపూర్ణత పొందుతాయని తెలిపారు.

కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఎంపిపి అంబటి నిర్మల శ్రీనివాస్, మాజీ జెడ్పి చైర్మన్ ఎచ్చెర్ల సూరిబాబు, జెడ్పిటిసి రుప్పా దివ్య,  మాజీ ఎంపిపి అంబటి శ్రీనివాసరావు, వైయ‌స్ఆర్ సీపీ నాయకులు చల్లా రవికుమార్, మెంటాడ స్వరూప్ పొన్నాడ ఋషి, బాన్న నర్సింగరావు, ఉటపల్లి కృష్ణ సర్పంచ్లు ఇందుమతి, గేదల చెంగాళ్ రావు, పొన్నాన కూర్మరావు, చిట్టి రవి, కనుగుల అప్పలనాయుడు, రామ కృష్ణ, మనోజ్ కుమార్, గంగు నరేంద్ర, ఎంపిటిసి రావాడ మోహన్, చిట్టి లక్ష్మణ్, అప్పలసూరి, నక్క శంకర్, బగ్గు అప్పారావు, వైస్సార్సీపీ నాయకులు బాన్న నర్సింగరావు, ఉటపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Back to Top