మెడాల్‌ సంస్థపై సమగ్ర విచారణ చేపట్టాలి

ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
 

అసెంబ్లీ: మెడాల్‌ సంస్థపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండు చేశారు. సోమవారం అసెంబ్లీలోని ప్రశ్నోత్తరాల సమయంలో పీలేరు ఆసుపత్రిపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..గతంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆసుపత్రుల తీరులో ఎలాంటి మార్పు లేదు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పీలేరు ఆసుపత్రిని 30 పడకల నుంచి 100 పడకలు చేశారు. అలాగే వాయల్పాడు ఆసుపత్రిని 50 పడకలు చేశారు. పీలేరుకు రూ.24 కోట్లు, వాయల్పాడుకు రూ.7 కోట్లు మంజూరు చేశారు.  గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు చేసేందుకు మెడాల్‌ సంస్థకు అనుమతులు ఇచ్చారు. అవసరం లేకపోయినా రక్త పరీక్షలు రాశారు. ప్రభుత్వం మెడాల్‌ సంస్థకు కోట్లు చెల్లిస్తోంది. మెడాల్‌ సంస్థపై సమగ్ర విచారణ చేపట్టాలి. దీనిపై కమిటీ ఏర్పాటు చేయాలి. షుగర్‌ లేకపోయినా మెడాల్‌ సంస్థ ఉన్నట్లు చూపిస్తున్నారు. పరీక్షలన్నీ కూడా తప్పుల తడకలే. గత ఐదేళ్లలో టీడీపీ ఎన్నికోట్లు మెడాల్‌కు ఇచ్చిందో విచారణ చేపట్టాలి.

తాజా ఫోటోలు

Back to Top