బాబూ..మీ మీద కేసు పెట్టగానే అమరావతి పారిపోయారా?

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

కాంప్రమైజ్‌ అయి హైదరాబాద్‌ నుంచి వచ్చేశానని ఒప్పుకున్న చంద్రబాబు

ఓటుకు కోట్లు కేసుకు భయపడి వచ్చేశానని పరోక్షంగా అంగీకరించిన సీఎం

చంద్రబాబూ..మీ స్వార్థం కోసం ప్రజలను బలి చేస్తారా?

చంద్రబాబు ప్రకటనపై వైయస్‌ఆర్‌సీపీ ఆగ్రహం

డేటా చోరీపై మేం అడిగిన ఏ  ఒక్క ప్రశ్నకైనా సమాధానం ఇచ్చారా?

సాధికార మిత్ర..సేవా మిత్ర రెండూ  ఒక్కటి కాదా

ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు వైయస్‌ఆర్‌సీపీ పోరాటం

హైదరాబాద్‌:  ఏపీ ప్రజల కష్టాలు చంద్రబాబుకు పట్టడం లేదని, ఓటుకు కోట్లు కేసు కోసమే అమరావతి నుంచి పారిపోయారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. కిడ్నాప్‌లు చేస్తారు, ఆస్తులు దొంగతనం చేస్తారని అంటున్నారని, అంటే మీ ప్రభుత్వంతో శాంతిభద్రతలు లోపించినట్లే కదా అని ప్రశ్నించారు.  ఇవాళ ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు సెల్ఫ్‌గోలు అయ్యారని వివరించారు. పదేళ్ల రాజధానిని వదులుకోవడానికి కారణాలు చెప్పేశాడన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు.  కేసీఆర్‌తో రాజీపడిన విషయాన్ని చంద్రబాబు ఒప్పుకున్నారన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉమ్మడి రాజధానిగా పదేళ్లు కేంద్రం ప్రభుత్వం ఇస్తే.. తన రాజకీయ అవసరాల కోసం రాజీ పేరిట ఉమ్మడి రాజధానిని వదిలేశానని చంద్రబాబు ఒప్పుకున్నారన్నారు. ఇంతకాలం రాజధాని కోసం వచ్చేశానంటూ బిల్డప్‌ఇచ్చిన వ్యక్తి అసలు వాస్తవాన్ని తానే బయటపెట్టారని గుర్తు చేశారు. విభజన తర్వాత సెంటిమెంట్‌ పేరుతో ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టిన చంద్రబాబు ఇప్పుడు అఫీసియల్‌గా కొన్ని వదిలిపెట్టవచ్చు..అనఫిషీయల్‌గా కొన్ని వదిలిపెట్టవచ్చు అని ఇవాళ చెప్పారని తప్పపట్టారు.

ఉమ్మడి రాజధానిని ముందే అప్పగించేశానని అనధికారికంగా రాజీ పడ్డానని చంద్రబాబు  లోగుట్టును తానే బయటపెట్టారని చెప్పారు. ఈ రోజు హడావుడిగా భర్తలు భార్యలను వదిలిపెట్టి అమరావతికి వెళ్లారని, అక్కడ ఎంత మందికి ఇల్లు లేక అవస్థలు పడుతున్నారన్నారు. అమరావతిలో ఉద్యోగుల బాధలు ఇంతింత కాదన్నారు. కుర్చీలు లేక, ఉండేందుకు చోటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. 
చంద్రబాబు చేసిన డేటా చోరీ వల్ల ఎంతో మంది ఆధార్‌వివరాలు బయటకు వచ్చాయన్నారు. ఎంతో మంది ఫోన్‌ నంబర్లు ప్రైవేట్‌ వ్యక్తుల వద్దకు చేరాయన్నారు. వ్యక్తిగత వివరాలు వేరేవారికి చేరాయన్నారు. బాధ్యత గల ప్రభుత్వం ప్రజల వివరాలు సేకరించి ప్రైవేట్‌ వ్యక్తులు ఇచ్చారని ప్రశ్నిస్తే..దానికి సమాధానం చెప్పకుండా దానికి కౌంటర్‌గా ఇవాళ మీరు జాగ్రత్త పడండి..కిడ్నాప్‌లు కూడా జరగవచ్చు అని, ఆస్తులు దొంగతనం చేయవచ్చు అని ఉచిత సలహా ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. మీ అసమర్ధతను మీరే ఒప్పుకుంటున్నారని, శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అని నిలదీశారు.

గజ దొంగల పార్టీ టీడీపీ అని, మీ పార్టీని దొంగతనం చేసే దమ్ము ఎవరికి ఉంటుందన్నారు. ఒక్క రోజైనా కూడా ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పారా అని నిలదీశారు. 3.60 కోట్ల మందికి సంబంధించిన డేటా మీ పార్టీదా? ప్రజలదా సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. మీ యాప్‌ను ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు. కలర్‌ ఫోటోలు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. టీడీపీ వెబ్‌సైట్‌ను ఎందుకు తొలగించారన్నారు. అన్నింటిపైనా శ్వేతపత్రాలు ఇచ్చారు కదా? దీనిపై కూడా ఇవ్వాలని డిమాండు చేశారు. దొంగతనం వేరేవాళ్లు చేస్తే..మీ వద్ద ఉన్న సీఈఆవో అశోక్‌ ఎందుకు దాకున్నారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి చీప్‌ ఎలక్షన్‌కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే తప్పేముందని నిలదీశారు. అన్ని రకాలుగా చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, చోరీ చేసిన డేటా విదేశాల్లో దాచిపెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. 19.02న దశరథ రామిరెడ్డి ఫిర్యాదు చే స్తే కేసు రికార్డు చేశారని మీరే చెబుతున్నారని, మళ్లీ మీరే కేసు లేకుండా 23వ తేదీ సెర్చ్‌ చేస్తున్నారని ఆరోపిస్తున్నారని తప్పుపట్టారు. ప్రజాసాధికార సర్వే ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించింది మీరు కాదా అని ప్రశ్నించారు. అదే డేటాను ఎస్‌ఆర్‌డీహెచ్‌లో పెట్టారని, అక్కడి నుంచి ప్రైవేట్‌ సంస్థ ఐటీ గ్రీడ్‌కు ఎట్లా వచ్చిందని ప్రశ్నించారు.

ఐటీ గ్రీడ్‌ నుంచి సేవా మిత్ర యాప్‌లోకి ఎలా వచ్చిందన్నారు. సాధికార మిత్ర..సేవా మిత్ర రెండూ  ఒక్కటి కాదా అని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. మీకు సలహాదారుగా ఉన్న వేమూరి హరికృష్ణ ఈవీఎం కేసులో అరెస్టు అయిన వ్యక్తి కాదా అని అన్నారు. అలాంటి వ్యక్తిని ఎలా సలహాదారుగా పెట్టుకున్నారన్నారు. ఓటర్‌ లిస్టు మీ వద్ద ఉంటే తప్పుకాదు కానీ, కలర్‌ ఫోటోలు ఉన్న ఓటర్‌ లిస్టు ఎలా వచ్చిందన్నారు. 26వ తేదీ మీ యాప్‌ నుంచి ఫోటోలు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. డేటా వివరాల చోరీ వ్యవహారంలో ఐటీ మంత్రి లోకేష్‌ మీడియాతో మాట్లాడాలని, అయితే ఆయన రాకుండా దాక్కున్నారని, చంద్రబాబు ఏ హోదాలో ఈ వివరాలు వెల్లడించారని ధ్వజమెత్తారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడదామన్న ధ్యాస చంద్రబాబుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ గ్రీడ్, బ్లూ ఫ్రాగ్‌కు ఏవైతే కాంట్రాక్టు ఇచ్చారో వాటిని రద్దు చేయాలని బుగ్గన డిమాండు చేశారు.  ఆంధ్రుల ఆత్మ గౌరవం కాపాడేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. 

 

Back to Top