టీటీడీ చైర్మ‌న్‌గా భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి 

తిరుప‌తి: తిరుమల తిరుపతి దేవస్థానం నూత‌న చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియ‌మించారు. ప్ర‌స్తుత ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రస్తుత టీటీడీ బోర్డు పదవీకాలం ఆగస్టు 8తో ముగియనుంది. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా పని చేసిన అనుభవం ఉంది. దివంగత మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ప‌నిచేశారు. తనను టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాజా నియామకంతో రెండేళ్ల పాటు టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

Back to Top