నిత్యం పగ, ప్రతీకారాలతో పవన్‌ భీష్మ ప్రతిజ్ఞలు

పవన్‌పై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఫైర్‌

తిరుపతి: ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై పవన్‌ కల్యాణ్‌ దాడికి దిగుతున్నట్లుందని, వినతిపత్రం పేరుతో దండయాత్రకు వస్తున్నట్టుగా ఉందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఫైరయ్యారు. ప్రజస్వామ్యబద్ధంగా ఉన్న వైయస్‌ఆర్‌సీపీపై నిత్యం నిందలు వేస్తున్నాడని మండిపడ్డారు. పవన్‌ తనకు ఓట్లు వేస్తే ఏమి చేస్తాడో చెప్పకుండా నిత్యం పగ, ప్రతీకారాలతో భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నాడన్నారు.  
 

Back to Top