బాబు, పవన్‌ విషం చిమ్మితే.. ప్రజలు అమృతం కురిపిస్తున్నారు

పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలవలేడు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కుటిలబుద్ధి కలిగిన చంద్రబాబు, పవన్‌ విషం చిమ్మితే.. ప్రజలు అమృతం కురిపిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు మోసపూరిత మాటలను ప్రజలు అసలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలవలేడని స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పారు. జగనన్నతోనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. 
 

Back to Top