వీధి రౌడీలకంటే దారుణంగా పవన్‌ వ్యాఖ్యలు

గొంతు పిసికి చంపుతానని మాట్లాడటం హత్యానేరంతో సమానం

చంద్రబాబు, పవన్‌ వికృత చేష్టలు జనం గమనిస్తున్నారు

పవన్‌ కల్యాణ్‌ ప్రజాస్వామ్య ద్రోహిగా మిగిలిపోతాడు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: సభ్యత, సంస్కారం మరిచి వీధి రౌడీలకంటే దారుణంగా పనికిమాలిన మనుషులు మాట్లాడే భాష‌ను పవన్‌ కల్యాణ్‌ మాట్లాడాడని, పవన్‌ ప్రజాస్వామ ద్రోహిగా మిగిలిపోతాడని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. పవన్‌ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తిరుపతిలోని వైయస్‌ఆర్‌ విగ్రహం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి చెప్పులను కుప్పగా పోసి నిరసన తెలిపారు. 

‘పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు తీవ్రమైన నేరంతో సమానం. గొంతు పిసికి చంపుతానని మాట్లాడటం హత్యా నేరంతో సమానం. పవన్‌ మూడు తీవ్రమైన నేరాలు చేశాడు. చెగువేరా, చలం ఆదర్శమని చెప్పే పవన్‌ ఇలాగేనా మాట్లాడేది. రాజకీయాల్లో ఇంతవరకూ ఎవరూ ఇలా దిగజారి మాట్లాడలేదు. చెప్పు చూపించి మాట్లాడటం ఏంటీ..? రాజకీయాల్లో మనుగడ కొన‌సాగించాల‌నే వ్యక్తులు చేసే పనులు కాదివి. వీధిరౌడీలకంటే దారుణమైన పనికిమాలిన మనుషులు మాట్లాడే మాటలు మాట్లాడాడు. 

నోవాటెల్‌ హోటల్‌ వేదికగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రీ ఫిక్డ్స్‌ ప్రోగ్రాంను గొప్పగా ప్రజెంట్‌ చేయాలని చూశారు.. కానీ వారి రహస్యబంధం ప్రజలందరికీ తెలుసు. ఇంతకాలం వైయస్‌ఆర్‌ సీపీ ఏ మాట అయితే చెబుతుందో అదే నిజమైంది. ప్రజాస్వామ్యం ఖూనీ కాలేదు. దుర్మార్గంగా హత్యలు చేయడానికి కూడా వెనకాడమని చెప్పుకునే మీలాంటి వారిని కట్టడి చేయడానికి చట్టబద్ధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట. జనం మీ ఇద్దరి వికృత చేష్టలు, భాష గమనిస్తున్నారు. హద్దులేనంత స్థాయిలో మాట్లాడిన పవన్‌ తీరుకు నిరసన తెలుపుతున్నాం. పవన్‌ ప్రజాస్వామ్య ద్రోహిగా మిగిలిపోతాడు’ అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top