ఇది ఓటాన్ అకౌంట్స్ కాదు..అకౌంట్స్ ఫ‌ర్ ఓట్స్‌

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

రామారావు బ‌తికి ఉంటే వైయ‌స్ఆర్‌సీపీకి ఓట్లు వేసేవాడు

రెండేళ్ల‌లో ప‌న్ను ఆదాయం రూ.50 వేల కోట్ల నుంచి రూ.75 వేల కోట్లు అవుతుందా? 

కేంద్రం నుంచి రూ.60 వేల కోట్లు వచ్చాయ‌ని చూపించారు

సీనియారిటీ లిస్టు ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు

హైద‌రాబాద్‌: అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ ఓటాన్ అకౌంట్స్ కాద‌ని, అకౌంట్స్ ఫ‌ర్ ఓట్స్ అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి విమ‌ర్శించారు. బ‌డ్జెట్ అంతా కాకీ లెక్క‌లు,గుర్రం పందెల ప‌రుగులా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.  బుధ‌వారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎన్‌టీ రామారావు న‌మ్మిన సిద్ధాంతాన్ని చంద్ర‌బాబు తూట్లు పొడుస్తున్నార‌ని విమ‌ర్శించారు. చేతుల్లో మీడియా ఉంద‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. సంప‌ద పోగొట్టుకుంటే చాలా పోగొట్టుకుంటామ‌న్నారు. న‌మ్మ‌కం కోల్పోతే కూడా చాలా కోల్పోతార‌న్నారు. జిమ్మిక్కులు చేసి ఏదో చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఎన్‌టీ రామారావు బ‌తికి ఉంటే వైయ‌స్ఆర్‌సీపీని స‌పోర్టు చేసేవారు అన్నారు. చంద్ర‌బాబు నాలుగేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నార‌ని, ఆ త‌రువాత కాంగ్రెస్‌తో క‌లిశార‌న్నారు.

ఎన్‌టీఆర్ స్ఫూర్తికి విరుద్ధంగా చంద్ర‌బాబు ప‌ని చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. ఎన్‌టీఆర్ క్యాంటీన్ అంటూ పేర్లు పెట్టుకొని ల‌బ్ధి పొందుతున్నార‌ని, అయితే ఆయ‌న్ను దింపిన వారే ఇ లా చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఐదేళ్ల ప‌రిపాల‌న త‌రువాత జీత‌భ‌త్యాలు, ప్ర‌భుత్వం న‌డిచేందుకు రాష్ట్ర ఖ‌జానా నుంచి డ్రా చేసేందుకు వీలు ప‌డుదు కాబ‌ట్టి ఓటాన్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతార‌న్నారు. కానీ చంద్ర‌బాబు బ్ర‌హ్మండమైన బ‌డ్జెంట్ అంటూ అకౌంట్ ఫ‌ర్ ఓట్లు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌వ‌ర్న‌ర్ రెక‌మెండేష‌న్ మేర‌కు ఆప‌ధ‌ర్మ ఫైనాన్స్ మినిస్ట్రిర్ రూ.66 వేల కోట్లు మాత్ర‌మే డ్రా చేసే వీలుంటుద‌న్నారు. పింఛ‌న్లు, జీతాలు, వ‌డ్డీలు మాత్ర‌మే చెల్లించే వీలుంటుంద‌ని, అలాంటిది చంద్ర‌బాబు గుర్రంపై స‌వారీ చేస్తున్న‌ట్లు మ్యాజిక్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన 600 వాగ్ధానాల్లో ఎన్ని అమ‌లు చేశార‌ని ప్ర‌శ్నించారు. రైతులు, డ్వాక్రా మ‌హిళ‌ల రుణాలు మాఫి చేస్తామ‌ని మాట ఇచ్చి..అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కండీష‌న్లు పెట్టి మాఫిలో మెలిక‌లు పెట్టార‌న్నారు. ఇంకా రూ.8200 కోట్లు రుణ‌మాఫి చేయాల్సి ఉంద‌న్నారు.  

ఇప్పుడు కొత్త‌గా అన్న‌దాత సుఖీభ‌వ అంటున్నార‌ని  విమ‌ర్శించారు. పాత అప్పులు క్లీయ‌ర్ చేయ‌కుండా కొత్త‌గా మోసాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. డ్వాక్రా రుణాల మాఫికి రూ.14 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంద‌న్నారు. ఇది ఇవ్వ‌కుండా ప‌సుపు-కుంకుమ అంటూ ప్ర‌జ‌ల ఆస్తి పంపి పెట్టి బిల్డ‌ప్ ఇస్తున్నార‌ని, అది దాన‌ధ‌ర్మం కాద‌ని, అది ఆడ‌బిడ్డ‌ల హ‌క్కు అన్నారు. నిరుద్యోగ భృతి అంటూ ద‌గా చేశార‌న్నారు. నాలుగున్న‌రేళ్లు ఇవ్వ‌క‌పోతే రెండు నెల‌ల క్రితం రూ.1000 ఇస్తున్నార‌ని విమ‌ర్శించారు. కేవ‌లం 4.5 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే నిరుద్యోగ భృతి ఇస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రూ.2 వేలు ఇస్తే కూడా నిరుద్యోగ భృతికి రూ.5 వేల కోట్లు కావాల‌న్నారు. అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కానికి రూ.5 వేల కోట్లు, ప‌సుసు-కుంకుమ‌కు రూ.4 వేల కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.3 వేల కోట్లు, పింఛ‌న్ల‌కు రూ.24 వేల కోట్లు కేటాయించార‌న్నారు. రూ.25 వేల కోట్లు అద‌నంగా కావాల్సి ఉంద‌న్నారు.2017-18 సంవ‌త్స‌రానికి రూ. 1.ల‌క్ష 5 వేల కోట్లు ఉంద‌న్నారు. రెండెళ్ల‌కు రూ.80 వేల కోట్లు ఎట్లా పెరుగుతుంద‌ని ప్ర‌శ్నించారు. ప‌న్నులు పెరుగుతాయ‌ని గాల్లో లెక్క‌లు చెబుతున్నార‌ని త‌ప్పుప‌ట్టారు.

లెక్కల్లో గుర్రం కంటే వేగంగా ప‌రుగెత్తిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. ఏడాదికి రూ.1000 నుంచి రూ.2 వేల కోట్ల‌కు మించి పెరుగ‌వ‌న్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులు కాద‌ని ఎక్క‌డైనా పెరుగుతుందా అని నిల‌దీశారు.  కేంద్రం నుంచి రూ.50690 కోట్లు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. వాస్త‌వాలు గ‌మ‌నిస్తే 2017-2018లో కేంద్రం నుంచి వ‌చ్చే రాబ‌డికి ఇక్క‌డి రాబ‌డికి పొంతన లేద‌న్నారు. వాళ్లే కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని చెబుతున్నారు. బ‌డ్జెట్‌లో మాత్రం కేంద్రం మూడింత‌లు ఇస్తున్నార‌ని చెబుతున్న‌ట్లు త‌ప్పుబ‌ట్టారు. కాగ్ లెక్క‌ల ప్ర‌కారం మ‌న‌కు వ‌చ్చేది స‌వ‌ర‌ణ రూ.1.56 ల‌క్ష‌ల‌ కోట్లు మాత్ర‌మే అన్నారు. వ‌చ్చింది రూ.12 వేల కోట్లు మాత్ర‌మే అన్నారు. రెవెన్యూ లోటు 2018-2019లో రూ.16 వేల కోట్లు ఉండేద‌న్నారు. అర్ధ‌సంవ‌త్స‌రానికి రూ.8 వేల కోట్లు ఉంటుంద‌న్నారు. న‌మ్మ‌స‌ఖ్యం కాని లెక్క‌ల‌తో మోసం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అప్పు చేయ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఫ‌ర్‌ఫెక్ట్‌గా ఉంద‌న్నారు. ప్ర‌పంచంలోనే హ్యాపీ సిటీ అమ‌రావ‌తి అని చెప్పుకుంటున్నార‌న్నారు. అక్క‌డ ఎవ‌రూ సంతోషంగా లేర‌ని, చంద్ర‌బాబు ఒక్క‌రే సంతోషంగా ఉన్నార‌న్నారు. బ‌డ్జెట్లో అమ‌రావ‌తికి కేటాయింపులు లేవ‌న్నారు.

లెట్రీన్ల‌లో కూడా అవినీతికి పాల్ప‌డ్డార‌ని త‌ప్పుప‌ట్టారు. స్థూల ఉత్ప‌త్తిలో 29 శాతంలో ఉంద‌న్నారు. మూడింత‌ల ఆదాయం అంటూ అప్పులు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. 
జిల్లాల్లో పోలీసు అధికారుల ట్రాన్స్‌ఫ‌ర్స్ జీవోలు ఇచ్చార‌న్నారు. ఏఆర్ దామోద‌ర్‌ను ఎస్పీ విజ‌య‌న‌గ‌రానికి బ‌దిలీ చేశార‌న్నారు. ఏ. వెంక‌ట‌ర‌త్నాన్ని శ్రీ‌కాకుళం ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చార‌న్నారు. లా ఆండ్ ఆర్డ‌ర్ జాయింట్ క‌మిష‌న‌ర్ విష్ణువ‌ర్ధ‌న్‌రాజును నియ‌మించార‌న్నారు. వీల్లేమైనా ఐపీఎస్ ఆఫీస‌ర్లా అని ప్ర‌శ్నించారు. ఎస్పీ పోస్టులో ఐపీఎస్‌ల‌ను నియ‌మించాల్సి ఉంద‌న్నారు. కేడ‌ర్ ఉద్యోగుల‌ను ఎలా నియ‌మిస్తార‌ని నిల‌దీశారు. ఆ పోస్టుల్లో ఐపీఎస్‌లు లేకుంటే, లేదా మూడు నెల‌ల కంటే ఆ పోస్టు భ‌ర్తీ కాకుంటే క్యాడ‌ర్‌లో ఉన్న వారిని నియ‌మించ‌వ‌చ్చు అన్నారు. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులు లేరా అని ప్ర‌శ్నించారు. ఐపీఎస్ ఆఫీస‌ర్లు ఈ అన్యాయాన్ని గ‌మ‌నించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఒక్క‌రైనా మాట్లాడ‌రా అని కోరారా. నాన్ కేడ‌ర్ ఆఫీస‌ర్లును ఇస్తే అది క‌చ్చితంగా అబ్జ‌క్ష‌నే అన్నారు. చంద్ర‌బాబుకు కుల వివ‌క్ష లేద‌ని చెబుతుంటార‌ని, కానీ ఆయ‌న‌కు న‌చ్చిన వారిని సీనియారిటీ లేకుండా నియ‌మించిన పోస్టులు లేవా అన్నారు. డీఎస్‌పీ ఒంగోలు పోస్టు ఇంపార్‌టెంట్ కాదా, డీఎస్పీ క‌ర్నూలు, గుంటూరు, గుడివాడ‌, తుళ్లూరు, ప‌ల‌మ‌నేరు, నెల్లూరు ఇంట‌లీజెన్సీ, కొవ్వూరు, గూడురు నెల్లూరు, మార్కాపురం, ఆత్మ‌కూరు డీఎస్పీ పోస్టులు అన్నీ కూడా ఎన్నిక‌ల్లో ఫోక‌స్ పోస్టులు కాదా అని నిల‌దీశారు. ఇందులో 90 శాతం నియ‌మ‌కాలు రెండు నెల‌లుగా జ‌రిగాయ‌న్నారు. సీనియారిటీ లిస్టు ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. మేం చెప్పిన‌దాంట్లో త‌ప్పుముంద‌ని హోంమంత్రికి స‌వాలు విసిరారు. 34 మంది కీల‌క‌మైన పోస్టుల్లో ఒకే స‌మాజిక‌వ‌ర్గానికి చెందిన వారిని నియ‌మించ‌డంలో ఆంత‌ర్యం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. సూప‌ర్ న్యూమ‌రిపోస్టుల‌ను ఎవ‌రి కోసం క్రియేట్ చేశార‌ని సందేహం వ్య‌క్తం చేశారు.

Back to Top