మెరుగైన వైద్య సేవ‌లు అందించాలి

అస్వ‌స్థతకు గురైన గిరిజ‌నుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మీ

విశాఖ‌: క‌లుషిత ఆహారం తిని అస్వ‌స్థ‌కు గురై పాడేరు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ మెత‌క‌పాలెం గిరిజ‌నుల‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మీ ప‌రామ‌ర్శించారు. బాధితుల ఆరోగ్య ప‌రిస్థితిని డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌ను ఆదేశించారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ.. గిరిజ‌నులకు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌ను ఆదేశించామ‌న్నారు. ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి బాగానే ఉంద‌ని చెప్పారు. పూర్తిగా కోలుకున్న త‌రువాతే బాధితుల‌ను వారి గ్రామాల‌కు తర‌లించ‌నున్నామ‌న్నారు.

తాజా ఫోటోలు

Back to Top