విద్యార్థుల పరీక్షలపై రాద్ధాంతమెందుకు..?

సీఎం వైయస్‌ జగన్‌ చందమామ లాంటి వ్యక్తి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా

విజయవాడ: గతంలో లోకేష్‌ ఎలాగ అడ్డదారుల్లో మంత్రి అయ్యాడో.. అలాగే విద్యార్థులను కూడా అడ్డదారుల్లో పరీక్షలు పాసైపోండి అని మెసేజ్‌ ఇస్తున్నట్టుగా నారా లోకేష్‌ వైఖరి ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే పరీక్షలు రద్దు చేయాలని లోకేష్‌ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయని పనికిమాలిన చర్యలకు లోకేష్‌ పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్నారన్నారు. ఆరోగ్యవంతమైన వాతావరణంలోనే పరీక్షలు పెట్టాలని యోచిస్తున్నారన్నారు. 

మెంటల్‌ మామ ఎవరో ప్రజలందరికీ తెలుసు అని, సీఎం వైయస్‌ జగన్‌ చందమామ లాంటి వ్యక్తి అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఈ రోజు ప్రశాంతంగా ఉన్నారంటే.. సీఎం వైయస్‌ జగన్‌ సుపరిపాలన వల్లేనన్నారు. చంద్రబాబు 3.50 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేసి వెళ్లిపోయినా.. ఏరోజూ కుంటిసాకులు చెప్పకుండా తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారన్నారు. 
 

Back to Top