పవన్‌ భవిష్యత్తుకే క్లారిటీ లేదు.. మీకేం భరోసా ఇస్తాడు..?

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ సెటైర్లు

నెల్లూరు: తన భవిష్యత్తుకే క్లారిటీ లేని పవన్‌ కల్యాణ్‌.. తనకు జై కొట్టించుకునే పిల్లల భవిష్యత్తుకు ఏం భరోసా ఇస్తాడని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. పవన్‌కు జై కొడుతూ కొంతమంది పిల్లలు వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారన్నారు. మహిళా శక్తి అంటూ తిరిగే టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదన్నారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం, కత్తితో మహిళపై దాడి చెయ్యడమేనా మహిళా శక్తి అంటే..? అని ప్రశ్నించారు. 
 

Back to Top