రెయిన్‌ గన్స్‌ పేరుతో టీడీపీ దోపిడీ లోకేష్‌కు గుర్తులేదా..?

నారా లోకేష్‌పై ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఫైర్‌

అనంతపురం: అధికారంలో ఉండగా రైతులను నిలువునా వంచించిన తెలుగుదేశం పార్టీ, అధికారం కోల్పోయాక అన్నదాతలపై కపట ప్రేమ కురిపిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు లోకేష్‌కు రైతులు గుర్తుకురాలేదా..? అని ప్రశ్నించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబును ఎందుకు నిలదీయలేదు. రెయిన్‌ గన్స్‌ పేరుతో జరిగిన దోపిడీ లోకేష్‌కు గుర్తులేదా..? అని ప్రశ్నించారు. నారా లోకేష్‌ తీరుపై ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు.  వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం వైయస్‌ జగన్‌ అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. పొలంలో విత్తనం విత్తే సమయం నుంచి.. చేతికొచ్చిన పంట రైతు లాభసాటిగా అమ్ముకునే విషయం వరకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. అదే విధంగా వర్షాలతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని వివరించారు. 
 

Back to Top