పాదయాత్ర అన్నివర్గాల ప్రజల్లో భరోసా నింపింది

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంజద్‌ బాషా
 

 

విజయవాడ: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ జిల్లా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే అంజద్‌బాషా అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు రుణాన్ని తీర్చుకున్నారు. పదికి పది స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులను గెలిపించారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ద్వారా అన్ని వర్గాలకు భరోసా నింపారన్నారు. రాజన్న రాజ్యం తీసుకువస్తానని నమ్మకం కల్పించడంతో అన్ని వర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌కు ఓటు వేశారన్నారు. 175 స్థానాల్లో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని వైయస్‌జగన్‌ చరిత్ర సృష్టించారన్నారు. వైయస్‌ జగన్‌ పట్టాభిషేకం చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారని, వారందరికీ అంజద్‌బాషా కృతజ్ఞతలు తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top