ఏడాదిన్న‌ర కాలం‌లో  అద్భుత పాల‌న  

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు

వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ప్ర‌తి గుండె చ‌ప్పుడు విన్నారు

చంద్ర‌బాబు మాయ‌ల ఫ‌కీర్‌

మ‌త్స్య‌కారుల అభివృద్ధికి ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింది

అన్ని వ‌ర్గాల్లో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకురావాల‌ని సీఎం భావిస్తున్నారు

బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తికి ప్ర‌భుత్వం కృషి చేస్తోంది

ప్రాంతీయ అస‌మాన‌త‌ల‌ను తొల‌గించేలా వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న చేస్తున్నారు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్న‌ర కాలంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అద్భుత పాల‌న‌ను ప్ర‌జ‌లు చూశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. అన్ని వ‌ర్గాల్లో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకురావాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భావించార‌ని చెప్పారు. చంద్ర‌బాబు మాయ‌ల ఫ‌కీర్ మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ప్ర‌తిప‌క్షం కుట్ర‌లు, ఎత్తుగ‌డ‌ల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, అంతిమ నిర్ణ‌యం ప్ర‌జ‌ల‌దే అన్నారు. శ‌నివారం తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

మ‌త్స్య‌కారుల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి..
రాష్ట్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌త్స్య‌కారుల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి సారించారు. చేప‌ల వేట‌కు గుజ‌రాత్‌, పాకిస్థాన్ సైతం వెళ్లిఅక్క‌డ ఇబ్బందులు ప‌డుతున్న సంద‌ర్భంలో వారి క‌ష్టాల‌ను గ‌మ‌నించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అక్క‌డ చిక్కుకున్న మ‌త్స్య‌కారుల‌ను విడుద‌ల చేయించారు. చేప‌ల వేట నిషేద స‌మ‌యంలో మ‌త్స్య‌కారుల‌కు ప్రోత్స‌హ‌కం అందించి ఆదుకుంటున్నారు. వారి క‌ష్టాల‌ను తొల‌గించేందుకు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి సారించారు. రూ.3 వేల కోట్ల‌తో షిప్పింగ్ హార్బ‌ర్స్‌, రూ.225 కోట్ల‌తో ఆక్వా హాబ్‌ల‌ను అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

ప్ర‌తి గుండె చ‌ప్పుడు విన్న నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌

రాష్ట్రంలో పాద‌యాత్ర నిర్వ‌హించిన వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌తి ఒక్క‌రి గుండె చ‌ప్పుడు విన్నారు.  ఈ రాష్ట్రంలో ఉన్న బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. 1947లో స్వాతంత్ర్యం వ‌చ్చినా ..మ‌న‌ల్ని మ‌న‌మే ప‌రిపాలించుకుంటున్నా..బ‌డుగు బ‌ల‌హీన వర్గాలు అనుకున్న స్థాయిలో మేలు జ‌రుగ‌క‌పోవ‌డం కొంత బాధ‌గా ఉంది. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వారిపై  ప్ర‌త్యేక దృష్టి సారించింది. బ‌ల‌హీన‌వ‌ర్గాలు, చిన్న‌చిత‌క వ‌ర్గాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించి, విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకురావాల‌ని ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో 14 మాసాలు అన్ని కాలాల్లో 3648 కిలోమీట‌ర్లు రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించి, ప్ర‌తి ప్రాంతంలోని గుండె చ‌ప్పుడు విన్నారు. అందుకే వారి క‌ష్టాల‌ను గుండెల్లో పెట్టుకుని ప‌రిపాల‌న ప్రారంభించిన వ్య‌క్తి వైయ‌స్ జ‌గ‌న్‌. ఈ ప్ర‌భుత్వానికి ముందు ఉన్న టీడీపీ ప్ర‌భుత్వం..చంద్ర‌బాబు మ‌తిలేని చ‌ర్య‌లు, దుర్మార్గ‌మైన పాల‌న చేశారు. అందుకే ప్ర‌జ‌లుగుండె త‌రుక్కుపోయే ఆవేద‌నతో టీడీపీని ఎన్నిక‌ల్లో నేల‌మ‌ట్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీని అత్య‌ధిక మెజారిటీతో గెలిపించారు. 151 సీట్ల‌తో గెలిపించారు. అమ‌రావ‌తిలోనే చంద్ర‌బాబు కుమారుడిని చిత్తుచిత్తుగా ఓడించారు. మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్‌ను ఓడించారు. ఇది మ‌న‌స్సున్న ప్ర‌భుత్వం, గుండె మంట‌లు తెలిసిన ప్ర‌భుత్వం ఇది. చంద్ర‌బాబు మాయ‌ల ప‌కీర్‌..ప్ర‌జ‌ల్లో లేక‌పోయినా అనేక‌మైన ఎత్తుగ‌డలు కుట్ర‌లు చేస్తున్నారు. వ్య‌వ‌స్థ‌లో చేరి కుతంత్రాలు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి మా ప్ర‌భుత్వానికి ఒక్క సంవ‌త్స‌రం ఆరుమాసాలు అవుతుంది. ఈ పాల‌న‌లో అద్భుతాలు చేశారు. ఏపీ ప్ర‌జానీకంలో వైయ‌స్ జ‌గ‌న్ అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో గుడి క‌ట్టుకున్నారు. అన్ని వ‌ర్గాల మెప్పు పొందారు.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల‌న్న‌దే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ల‌క్ష్యం..

 ప్ర‌జ‌ల గుండె మంట‌లు తెలిసిన నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌. ఈ రాష్ట్రంలో ప్రాంతీయ అస‌మాన‌త‌లు ఉన్న సంద‌ర్భంలో వైయ‌స్ జ‌గ‌న్ గుండె మండింది. అన్ని ప్రాంతాల‌ను అభివృద్ధి చేయాల‌ని పాల‌న సాగిస్తున్నారు. మూడు ప్రాంతాల‌ను స‌మన్వ‌యం చేస్తూ పాల‌న సాగిస్తున్నారు. ఈ రాష్ట్రంలో వంద‌లాది కులాలు ఉన్నాయి. గ‌త ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసింది. కార్పొరేట్ స్కూళ్ల కోసం ప్ర‌భుత్వ స్కూళ్ల‌ను నిర్వీర్యం చేశారు. అర్హులైన 32 ల‌క్ష‌ల మంది నిరుపేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు లేవంటే గ‌త ప్ర‌భుత్వం సిగ్గు ప‌డాలి. వారంద‌రికీ ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వాల‌ని మా ప్ర‌భుత్వం స‌దుద్దేశంతో ముందుకు వెళ్తుంటే అడ్డుప‌డుతున్నారు. వారంద‌రికీ ప‌ట్టాలిచ్చి ఆదుకుంటామ‌న్నారు. గ‌తంలో జ‌న్మ‌భూమి క‌మిటీలు వేశారు. లంచాలు ఇవ్వ‌నిదే ప‌ని చేయ‌లేదు. ఆ జ‌న్మ‌భూమి మంట‌లే వైయ‌స్ జ‌గ‌న్ గుండె మంట‌లు పెంచాయి. ఈ రోజు అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను తీసుకువ‌చ్చారు. వైద్య రంగంలో విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు తీసుకున్నాం. ఈ ప్ర‌భుత్వం 108, 104 వాహ‌నాల‌ను అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఏర్పాటు చేశాం. గ‌తంలో రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటే..మా ప్ర‌భుత్వం రైతు క్షేమం కోసం రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకుంద‌న్నారు. ఈ ఏడాది ఆరు మాసాల్లోఅద్భుత పాల‌న సాగించిన ప్ర‌భుత్వం వైయ‌స్ జ‌గ‌న్‌ది. వారి లాభాల కోసం ప్ర‌తిప‌క్షాల గుండెలు ఎప్పుడూ మండుతూనే ఉంటాయి. చంద్ర‌బాబు ఆయ‌న చెప్పిందే రాజ్యాంగం అంటారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉంటూ ఎవ‌రితో ఏం మాట్లాడిస్తూన్నారో ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌జ‌లే ప్ర‌జాస్వామ్యంలో దేవుళ్లు. అంతిమ నిర్ణ‌యం ప్ర‌జాస్వామ్యానిదే..ప్ర‌జ‌ల‌దే అని అంబటి రాంబాబు తెలిపారు. 

 

Back to Top