సంపూర్ణ మద్య నిషేధమే మా లక్ష్యం

చంద్రబాబుకు ఎందుకంత బాధ.. బ్రాండ్లు లేవనా? ధరలు పెరగాయనా?

మద్య నిషేధం గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు

హెరిటేజ్‌ ఫ్యాక్టరీలో కరోనా వస్తే ఎందుకు దాచిపెట్టారు

ప్రజలు మరిచిపోతారనే భయంతో చంద్రబాబు ‘జూమ్‌’ దర్శనాలు

కరోనాకు మందొస్తుంది కానీ, బాబు మనోవేధనకు మందే లేదు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: ఆపద సమయంలో హైదరాబాద్‌లో కూర్చొని జూమ్‌ యాప్‌లో దర్శనాలు ఇచ్చే వ్యక్తులు రాజకీయంగా పనికిరారు. క్లిష్టసమయంలో ప్రజలను ఆదుకోవడానికి ఆలోచన చేసేవారే నిజమైన రాజకీయ నాయకులు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. లిక్కర్‌ అమ్మకాలకు పర్మిషన్‌ ఇచ్చిన కేంద్రాన్ని ప్రశ్నించకుండా కేంద్రం ఇచ్చిన వెసులుబాటును పాటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడని మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ తీసుకువచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి మద్యాన్ని ఏరులై పారించిన చంద్రబాబుకు మద్య నిషేధం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో చెప్పారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం దశలవారి మద్య నిషేధం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

అంబటి ఏం మాట్లాడారంటే.. 

దేశంలో ఇప్పటికి 46,604 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 1572 మంది కరోనా వల్ల మృతి చెందారు. రాష్ట్రంలో 1717 మందికి పాజిటివ్‌ వచ్చింది. 34 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. అయినా ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు మన దేశం పెరుగుతున్నందుకు భయాందోళనలో ఉన్నా.. కొంత తక్కువగా ఉందనే అభిప్రాయంలో మన దేశంలోని వైద్య నిపుణులు భావిస్తున్నారు. 

మొట్టమొదటి లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసుకుంటూ వచ్చాం. రానురాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొన్ని సడలింపులు ఇస్తున్నారు. వ్యవసాయ పనులు, చిన్న చిన్న పరిశ్రమలు, నిత్యావసర వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు, అత్యవసరంగా కావాల్సిన వస్తువులను తయారు చేసే పరిశ్రమలు వీటికి లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇస్తున్నారు. 

సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ ముందుకెళ్లాలనే భావనతో గ్రీన్, ఆరెంజ్, రెడ్‌ జోన్లుగా డివైడ్‌ చేశారు. గ్రీన్‌ జోన్‌లో పూర్తిగా సడలింపులు, ఆరెంజ్‌ జోన్లలో ఆంక్షలతో కూడిన సడలింపులు, రెడ్‌ జోన్లలో సడలింపులు లేకుండా పరిపాలన సాగుతోంది. మొట్టమొదటగా వ్యవసాయానికి మినహాయింపు ఇచ్చారు. నిన్నటి నుంచి కేంద్ర ప్రభుత్వం లిక్కర్‌ అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడం జరిగింది. కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చాలా రాష్ట్రాల్లో లిక్కర్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మన రాష్ట్రంలో కూడా లిక్కర్‌ అమ్మకాలకు అనుమతి ఇస్తూ ఆబ్కారీ శాఖకు ఆదేశాలిచ్చారు. 

లిక్కర్‌ అమ్మకాలపై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. లిక్కర్‌పై గొంతెత్తుతున్నారో.. వారెందుకు కేంద్ర ప్రభుత్వానికి అడగడం లేదు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఎందుకు అడుగుతున్నారు. లిక్కర్‌ అమ్మకాలపై ఎందుకు వెసులుబాటు ఇచ్చిందని కేంద్రాన్ని అడగరు. 

సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాదయాత్రలో, ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. దాన్ని దశల వారీగా అమలు చేయాలనే దృక్పథంతో ఒక పాలసీని రూపొందించారు. మానవ సంబంధాలను చెడగొడుతున్న, కాపురాల్లో చిక్కుపెడుతున్న మద్యపానాన్ని నిషేధిస్తామని, కేవలం 5 స్టార్, స్టార్‌ హోటల్స్‌కు మాత్రమే మద్యాన్ని అమ్ముకునేట్లుగా చేసిన తరువాతే తిరిగి ఎన్నికలకు వెళ్తామని స్పష్టంగా వైయస్‌ జగన్‌ చెప్పారు. 

నందమూరి తారక రామారావు మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తే.. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి రాష్ట్ర ప్రజల చేత భయంకరంగా తాగించిన వ్యక్తి చంద్రబాబు. హైదరాబాద్‌లో తలదాచుకున్న తనను ప్రజలంతా మర్చిపోతారేమోననే భయంతో చంద్రబాబు జూమ్‌ యాప్, స్కైప్‌లోకి వస్తున్నాడు. వారానికి రెండు మూడు సార్లు సీఎం వైయస్‌ జగన్‌కు లెటర్లు రాస్తున్నాడు. 

లిక్కర్‌ అమ్మకాలు ప్రారంభించినందుకు బాధా..? లేఖ ధరలు పెంచినందుకు బాధా..? బ్రాండ్‌ సరిగ్గా ఇవ్వడం లేదనా.. ఏంటీ మీ బాధ చంద్రబాబూ..? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం ఏరులై పారింది. ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడానికి ఏ బ్రాండ్‌ అయితే ఏంటీ..? అసలు మద్యమే ప్రమాదకరం. అలాంటిది ఈ రాష్ట్రంలో ఉండకూడదని చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం ఏంటీ..? మద్యపాన నిషేధం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. ఏదో ఒక విధంగా బురదజల్లాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నాడు. 

హెరిటేజ్‌ కంపెనీ నుంచి పాల ప్యాకెట్లు బయటకు వచ్చే వరకు పెద్ద యాక్టివిటీ జరుగుతుంది. హెరిటేజ్‌లో పనిచేసే వారికి కరోనా సోకితే ఎందుకు బయటపెట్టలేదు. కార్మికులకు ఒక్కరికి కరోనా వచ్చినా ఎంత ప్రమాదం..? దీనిపై ఎందుకు మాట్లాడడం లేదు. హెరిటేజ్‌లో కరోనా సోకి క్వారంటైన్‌లోకి వెళ్తే ఆ విషయాన్ని ఎందుకు భయటపెట్టకుండా నొక్కేశారు. ఇలాంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదు. 

మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలనే దృక్పథంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. సామాన్యుడు మద్యాన్ని కొనలేని స్థితికి తీసుకువస్తాం.. పేదవాడి నుంచి మద్యాన్ని దూరం చేస్తామని వైయస్‌ జగన్‌ పాదయాత్రలోనే చెప్పారు.. చెప్పినట్లుగానే చేస్తున్నారు. మందు ఏమైనా నిత్యావసర వస్తువా..? మద్యాన్ని తాగవద్దు అని తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు ఉద్యమం చేయాలి. కానీ, ధరలు పెంచామని, షాపులు తెరిచారని, బ్రాండ్లు దొరడం లేదని ఉద్యమం చేయకండి. బ్రాండ్‌ల కోసం మాట్లాడి ఎందుకింత నీచ స్థాయికి దిగజారిపోతున్నారు చంద్రబాబు. 

కరోనా వైరస్‌ నివారణకు మెడిసిన్‌ వస్తుంది కానీ, చంద్రబాబు మనో వేధనకు మాత్రం మందే లేదు.. మళ్లీ తిరిగి అధికారం రాదు అనే మనో వేధనకు మందే లేదు చంద్రబాబు గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్‌ నుంచి బయటకు రారా..? ఎప్పటి వరకు ఉంటారు.. టీకా వేయించుకునే వరకు అక్కడే ఉంటారా..? సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ జనజీవన స్రవంతిలోకి వస్తారా..? రారా..? 
 

తాజా వీడియోలు

Back to Top