అవకాశం రాలేదని ఆయుధాలు తెస్తారా..?

సభలో టీడీపీ సభ్యుల తీరుపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజం

అసెంబ్లీ: శాసనసభా సంప్రదాయాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్నారని, సభలో విజిల్స్, కేకలు వేయడం, ఇంకా వారి తీరుచూస్తుంటే ఏమేమి ఆయుధాలు తీసుకువచ్చారో చెక్‌ చేయాల్సిన అవసరం ఉందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అసెంబ్లీ రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న టీడీపీ సభ్యులపై వెంటనే యాక్షన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సభా సంప్రదాయాలను పాటించని వ్యక్తులు ఎంతవారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా యాక్షన్‌ తీసుకోవాలని కోరారు. స్పీకర్‌ చైర్‌కు వేలు చూపిస్తూ ఘర్షణ చేస్తున్నారని, మాట్లాడే అవకాశం రాకపోతే విజిల్స్‌ వేస్తారా..? ఆయుధాలు తీసుకువస్తారా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే శాసనసభలోకి విజిల్స్‌ తీసుకువచ్చి ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ సభ్యులపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top