ఆ ఇద్దరి మూర్ఖుల మనసు రంజింపలేము

ప్రభుత్వానికి టైమ్‌ ఇచ్చే కెపాసిటీ పవన్‌కు ఉందా..?

పవన్‌ సినిమాలు, బాబు హెరిటేజ్‌ బేరాలు చేసుకోవడం ఖాయం

టీడీపీ, జనసేన డీఎన్‌ఏ ఒక్కటే.. పవన్‌ చంద్రబాబుకు దత్తపుత్రుడే

లాంగ్‌ మార్చ్‌లో పవన నిర్మాణ కార్మికులే కనిపించారు

వరదలు తగ్గిన వెంటనే ఇసుక సమస్య తీరుతుంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: ఎన్ని ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ఒక చక్కని అవినీతి రహిత పాలన అందిస్తున్నా.. ఆ ఇద్దరి మూర్ఖుల మనస్సు మాత్రం రంజింపలేము. వరదలు తగ్గిన తరువాత ఇసుక కొరత తీరుతుందని ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖులకు అర్థం కాని వ్యవహారంగా మిగిలిపోతుంది. భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన లాంగ్‌... మార్చ్‌లో జనసేన జెండాలు పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్తల, పవన నిర్మాణ కార్యకర్తలే కనిపించారని, భవన నిర్మాణ కార్మికులు కనిపించలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పవన్‌కు సినిమాల్లోకి వెళ్లి వేషాలు వేసుకునే సమయం ఆసన్నమైందని, ఈ మధ్యే పింక్‌ అనే సినిమాకు సంతకం కూడా పెట్టారని విన్నాం.. సినిమాల్లో నటించడానికి సంతకం పెట్టారంటే.. సీఎం వైయస్‌ జగన్‌ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని పవన్‌ అంతరాత్మ అంగీకరించినట్లే అన్నారు. పవన్‌ సినిమాలు, బాబు హెరిటేజ్‌ బేరాలు చేసుకోవడం ఖాయమన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విశాఖలో భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్‌ లాంగ్‌ మార్చ్‌ చేశాడు. నడవకుండా కారు మీద ఎక్కి రెండు కిలోమీటర్లు లాంగ్‌ మార్చ్‌ చేసి లాంగ్‌ మీటింగ్‌ పెట్టాడు. ఆ మార్చ్‌లో తెలుగుదేశం కార్యకర్తలు, పవన నిర్మాణ కార్యకర్తలు కనిపించారు తప్ప.. భవన నిర్మాణ కార్మికులు కనిపించలేదు. 

ఒకవైపు అయన్నపాత్రుడు, మరోవైపు అచ్చెన్నాయుడిని పెట్టుకొని పవన్‌ చాలా కామెంట్లు చేశారు. మీటింగ్‌ పెట్టింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసమా.. లేక ఐదు నెలల పాటు పవన్‌ కల్యాణ్‌ను, చంద్రబాబును విమర్శించారో.. వాటికి సమాధానం చెప్పడానికా..? అర్థం కాని పరిస్థితి. పనికొచ్చే మాటలు ఒక్కటి మాట్లాడకపోగా.. వ్యక్తిగత దాడులు చేసే ప్రయత్నం చేశారు. 
ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు అనే నన్ను వ్యక్తిగతంగా విమర్శల దాడులు చేశారు. ఇది రాజకీయాల్లో ధర్మమేనా..? 

పవన్‌ అంటే మాకు కోపం లేదు. గౌవరం, ప్రేమ కూడా ఉంది. అజ్ఞాతవాసి సినిమాను రెండుసార్లు, కాటమరాయుడును మూడుసార్లు, అత్తారింటికి దారేది సినిమా ఎన్నిసార్లు చూశామో చెప్పలేం. పవన్‌ సినిమాలు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో వివాహానికి వచ్చారు. మా పిల్లలను ఆశీర్వదించారు. చాలా సంతోషం. మీరంటే వ్యక్తిగత ద్వేషం వైయస్‌ఆర్‌ సీపీకి లేదు. ఉండదు కూడా.. చంద్రబాబు నాయుడిని భుజాన వేసుకొని మోస్తుంటే బాధ కలుగుతుంది. పవన్‌ తన రాజకీయాలు తాను చేస్తే ఏ విధమైన అభ్యంతరం ఉండదు. 

Read Also: ఇసుకపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం

తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ డీఎన్‌ఏలు ఒక్కటే.. బాబుకు పవన్‌ దత్తపుత్రుడే.. చంద్రబాబు ఎజెండాను మోయడమే పాలసీ తప్ప పవన్‌కు సొంత పాలసీ అంటూ ఏమీ లేదు. కూలిపోయిన ఎల్లోబిల్డింగ్‌ను నిర్మించేందుకు భవన నిర్మాణ కార్మికుడి అవతారం ఎత్తాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భవన కార్మికులు ఎన్ని కష్టాలు పడ్డారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 48 లక్షల ఇళ్లు నిర్మిస్తే.. చంద్రబాబు కేవలం 9 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారు. బాబు నిర్వాకంతో వేలాది మంది కార్మికులు వలసలు వెళ్లారు. అప్పుడు పవన్‌ నోరు ఎందుకు ఎత్తలేదు. 

రూ.1343 కోట్లు భవన నిర్మాణ కార్మికుల నిధి ఉంటే దానిలో కేవలం రూ.412 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మిగతాది చంద్రబాబు డైవర్టు చేశారు. ఆ రోజు పవన్‌ నోరు ఎందుకు ఎత్తలేదు. ఈరోజు వైయస్‌ఆర్‌ సీపీపై ఒంటికాలుపై లెగుస్తున్నారు. మాకు రెండు వారాలు టైం ఇస్తారంట. టైం ఇచ్చే కెపాసిటీ మీకుందా..? పవన్‌ టైం కోసం ఎదురుచూడటానికి వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా లేదు. అమరావతికి వచ్చి నడుస్తారంట.. రండి.. కరకట్ట మీదుగా నడిచి అక్రమంగా కట్టిన లింగమనేని గెస్ట్‌హౌస్‌లో ఉన్న మీ మిత్రుడిని బయటకు వెళ్లండి అని సలహా ఇచ్చే ధైర్యం ఉందా..? చంద్రబాబు అక్రమాలు, అన్యాయాలు చేస్తే పవన్‌ మాట్లాడడు.

తాటతీస్తామని అంటున్నాడు. రెండు చోట్ల నిలబడితే.. ప్రజలు ఒంగోబెట్టారు. కూర్చోబెట్టి తాటతీశారు. ఆరు నెలలకు ఒకసారి గడ్డం తీయడం కాదు.. తాటతీయడం అంటే. మీ నోరు కంటే వెయ్యి రెట్లు మా నోరు పెద్దది పవన్‌ కల్యాణ్‌. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. వ్యవసాయ శాఖ మంత్రిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతారా..? ఎంపీ విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతున్నారు.. ఇవన్నీ మీ మాటలు కాదు.. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు స్క్రిప్టు తీసుకువచ్చారు. 

వైయస్‌ జగన్‌పై చంద్రబాబు, కాంగ్రెస్‌ జతకట్టి అక్రమ కేసులు పెట్టారని ప్రజలకు తెలుసు. వైయస్‌ఆర్‌ సీపీ, వైయస్‌ కుటుంబాన్ని అక్రమంగా కేసులు పెట్టించి వేధించారని తెలిసి 151 సీట్లు ఇచ్చారు. పిటీషన్‌ డిస్మిస్‌ చేశారని మాట్లాడి అబాసుపాలవుతున్నారు. గౌరవ రాజ్యసభ సభ్యుడి గురించి అవాకులు పేలడం సరైన విధానం కాదు. రాజకీయంగా వంద విమర్శలు చేయండి.. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 

చంద్రబాబు సత్తా అయిపోయింది. రోజూ ఉపన్యాసాలు చెబుతున్నా.. ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరు. లోకేష్‌తో 6 గంటలు నిరాహార దీక్ష చేయించాడు. నేను రోజు 6 గంటలు దీక్ష చేస్తున్నా. పవన్‌కు ఓటు వేస్తే సైకిల్‌కు వేసినట్లేనని భావించి పవన్‌ అభిమానులు కూడా సీఎం వైయస్‌ జగన్‌కు ఓటు వేశారు. ఇప్పటికైనా పవన్‌ కల్యాణ్‌ సొంత ఆలోచనలతో ముందుకువెళ్లండి తప్ప.. ఎవరో ఆశయాల కోసం పనిచేయొద్దు. జనసేన తెలుగుదేశం పార్టీకి బీటీమ్‌ అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. 

Read Also: ఇసుకపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం

Back to Top