మేం అరిస్తే తట్టుకోలేరు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
 

అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..టీడీపీ సభ్యులు కేవలం 23 మంది మాత్రమే ఉన్నారని, మేం 151 మంది ఎమ్మెల్యేలం ఉన్నామని గుర్తు చేశారు. మేం అరిస్తే తట్టుకోలేరని హెచ్చరించారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షం సహకరించాలని కోరారు. మీరు చేసిన పనులకు ప్రజలు 23 సీట్లు మాత్రమే ఇచ్చారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని సూచించారు. చంద్రబాబు పెద్ద మనసు చేసుకొని వారి సభ్యులను కూర్చోబెట్టాలని, ధర్మాన్నివిస్మరిస్తే సభ కార్యాకలాపాలకు అంతరాయం కలుగుతుందని, టీడీపీ నేతలు సంయమనం పాటించాలని, పాయిట్‌ ఆర్డర్‌ పాటించాలని సూచించారు. చంద్రబాబు సీఎంగా 14 ఏళ్లు పని చేశారని, ఆయన తన సభ్యులను కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top