ప్రజాతీర్పు టీడీపీ మనుగడకే ప్రమాదం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
 

అమరావతి:151 అసెంబ్లీ సీట్లు ఇచ్చి వైయస్‌ఆర్‌సీపీకి ప్రజలు అఖండ విజయం ఇచ్చారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. దేశంలో చక్రాలు తిప్పిన చంద్రబాబు లాంటి సీనియర్‌ నాయకుడికి కూడా అందని అనూహ్య విజయాన్ని  వైయస్‌ఆర్‌సీపీకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారన్నారు. 151 సీట్లు వచ్చాయని విజయ గర్వంతో మత్తు ఎక్కలేదన్నారు. ఐదేళ్ల క్రితం చంద్రబాబు  బెల్ట్‌షాపుల రద్దుపై మొదటి సంతకాన్ని చేశారని...ఆ సంతకాన్ని ఐదేళ్ల అనంతరం  వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారన్నారు.  బెల్ట్‌షాపులనే రద్దు చేయలేని టీడీపీ ప్రభుత్వం ఎలాంటి పాలన చేసిందో  ప్రజలు చూశారన్నారు.ఐదు సంవత్సరాలు సమర్థవంతమైన పాలన అందించామని చంద్రబాబు,టీడీపీ నేతలు  చెప్పడం కాదని, ప్రజలు చెప్పుకోవాలన్నారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే ప్రజలు ఇచ్చారంటే టీడీపీ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని గ్రహించాలన్నారు. 2019కి పోలవరం పూర్తిచేసి ఎన్నికలకు వెళ్తాం రాసుకో అని చంద్రబాబు సవాల్‌ చేశారని గుర్తుచేశారు.ఇప్పుడు చంద్రబాబు ఏంచేశారని ధ్వజమెత్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top