చంద్రబాబు సభా విలువలు పాటించకపోవడం బాధాకారం

ఎమ్మెల్యే అంబటి రాంబాబు
 

 

అమరావతి:సభాపతి స్థానం క్లిష్టమైనదిగాను, ప్రజలు దగ్గర నుంచి గమనిస్తున్న స్థానంగానూ రూపొందినట్లు ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. విస్తృతమైన మీడియా వల్లన నేడు సభలో ప్రతి క్షణం ఏంజరుగుతుందో.. సభ నాయకులు ఏం మాట్లాడుతున్నారనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. గమనించిన తర్వాత ఐదేళ్ల తర్వాత తీర్పు కూడా ఇస్తున్నారన్నారు.గత శాసన సభ సమావేశంలో జరిగిన సన్నివేశాలు, సభాపతి,సభా నాయకులు ప్రవర్తించిన తీరు ఏవిధంగా ఉందో ప్రజలు గమనించారు.దానికి భిన్నంగా ఇప్పుడు మేం ప్రవర్తించబోతున్నాం అని సభా నాయకులు  హామీ ఇచ్చారని..సభాపతిగా సభ  నిర్వహణకు మీకు మార్గం సులభం అయ్యిందని తెలిపారు. గతంలో సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తించాలనేది..సభా నాయకుడి చేతిలో రిమోండ్‌ పెట్టుకుని ప్రవర్తించిన సందర్భాలు కొకోల్లలుగా చూశామన్నారు.గతంలో సభాపతులు వ్యవహరించిన తీరు చాలా ఎబ్బెట్టుగా ఉందన్నారు.అనుభవం గల రాజకీయ నాయకుడిగా చంద్రబాబు కనీస విలువలు పాటించకుండా స్పీకర్‌ను  సభాపతి స్థానంలో కూర్చోబెట్టేందుకు రాకపోవడం బాధాకారం మన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top