నాగార్జున రెడ్డి జర్నలిస్టు కాదు, టీడీపీ నేత

అతనిపై 17 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి

మహిళా పోలీసు అధికారిపై, జేసీ, నాపై నీచంగా పోస్టులు పెట్టాడు

నాగార్జునరెడ్డిపై దాడిని ప్రభుత్వానికి ఆపాదించాలని బాబు ప్రయత్నం

దాడి కేసులో ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేశాం

చీరాల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్‌

తాడేపల్లి: బ్రిటీష్‌వారు మన దేశాన్ని దోచుకున్నట్లుగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అనే ఫ్రాడ్‌ పార్టీని అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నాడని చీరాల నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్‌ ధ్వజమెత్తారు. చీరాలలో నాగార్జున రెడ్డి అనే వ్యక్తిపై దాడి జరిగితే దాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం ఉందని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. నాగార్జున రెడ్డిపై జరిగిన దాడిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ఈ కేసులో ఇప్పటికే కొంత మందిని అరెస్టు చేయడం కూడా జరిగిందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమంచి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

చంద్రబాబు నాయుడు చీరాలలో నాగార్జున రెడ్డి అనే వ్యక్తిపై దాడిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. నాగార్జున రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.  ప్రతిపక్షనేత స్థాయిలో ఉన్న చంద్రబాబు దిగజారి సమాజాన్ని తప్పుదోవపట్టించే విధంగా మాట్లాడడం సమంజసం కాదు. నాగార్జున రెడ్డి అనే వ్యక్తి జర్నలిస్టు కాదు. 2019 ఎన్నికల్లో టీడీపీ కౌంటింగ్‌ ఏజెంట్‌గా కూర్చున్నాడు. ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు అత్యంత సన్నిహితుడిగా మారి టీడీపీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నాడు. నాగార్జున రెడ్డి మా పార్టీకి చెందినవాడని చంద్రబాబు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే..
నాగార్జున రెడ్డి గతంలో రేపు కేసు, భార్యను హింసించడం, సూడో నక్సలైట్‌ పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేయడం. ఇలాంటి 17 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

అతను జర్నలిస్టు అని చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఒక వేళ జర్నలిస్టు అని చంద్రబాబు వర్గానికి చెందినవారు భావిస్తే ంచినా.. చీరాల మహిళా పోలీసు అధికారిపై మాట్లాడలేని భాషలో నీచంగా పోస్టులు పెట్టాడు. జాయింట్‌ కలెక్టర్‌ను, నా గురించి నీచంగా ఫేసుబుక్‌లో పోస్టులు పెట్టాడు. జర్నలిస్టు అంటే ఇలా అసభ్యకరంగా మాట్లాడుతాడా..? నా గురించి, నా కుటుంబం గురించి ఇలా నీచంగా రాయడాన్ని ఎవరైనా సమర్ధిస్తారా..? నాగార్జున రెడ్డి గురించి తెలుసు కాబట్టి టీడీపీ  అని చెబితే ఎక్కడ మచ్చపడుతుందోనని చంద్రబాబు జర్నలిస్టు అని వాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు అసోసియేషన్‌ ప్రస్తుత ప్రెసిడెంట్‌ ఐవీ సుబ్బారావు గురించి కూడా నీచంగా పోస్టులు పెట్టాడు.

నాగార్జున రెడ్డిపై దాడిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ఆపాదించాలని చూడడం, డీజీకి లెటర్‌ రాయడం చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనం. దేవుడు పంపిన వ్యక్తిలా సీఎం వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. నీతివంతమైన పాలన చేస్తుంటే సీఎం వైయస్‌ జగన్‌కు ఆపాదించడం దారుణం. రంగాను హత్య చేసి కారకులపై చిన్న కేసు కూడా లేకుండా చేసుకున్న నీచ వ్యవస్థ చంద్రబాబుది.
పత్తిపాడులో నారాయణరెడ్డిని హత్య చేయించింది చంద్రబాబు.
 
నా ఫ్యాక్టరీలో పనిచేసిన వారు కుటుంబ తగదాలతో ఓ మహిళ చనిపోతే సిగ్గులేకుండా చంద్రబాబు పరామర్శకు వచ్చి సీఎంపై నిందలు వేస్తున్నాడు. కోడెల శివప్రసాద్‌ చనిపోతే తెలంగాణ అంతా ఊరేగించాడు. ఏపీకి వస్తే నలుగురు కూడా లేరు. శవయాత్రలో రెండు వేళ్లతో విక్టరీ సింబల్‌ చూపించాడు. అంటే చంద్రబాబు  వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని సంతోషంగా విక్టరీ చూపించాడా..? సీఎం వైయస్‌ జగన్‌ శక్తి ముందు చంద్రబాబు చాలడు. బాబుపై నమ్మకం లేక వైయస్‌ఆర్‌ సీపీలో చేరేందుకు వేల సంఖ్యలో నాయకులు క్యూలో ఉన్నారు. 2017లో చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు వర్గీయులు ఆంధ్రప్రభ రిపోర్టర్‌ అనే వ్యక్తిని చంపితే ఈ రోజుకు అరెస్టు చేయలేదు. చీరాలలో జరిగితే 12 గంటలలోపు అరెస్టు చేయడం జరిగింది. వాహనం కూడా సీజ్‌ చేయడం జరిగింది. 

   
Back to Top