చంద్రబాబు నిర్ణయాన్ని లోకేష్‌ వ్యతిరేకిస్తున్నారా..?

ఎన్నికలు బహిష్కరించిన తర్వాత దుగ్గిరాలలో ప్రచారం దేనికి..?

తండ్రీకొడుకులకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్న

మంగళగిరి: పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కొడుకు లోకేష్‌ వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు ప్రకటించిన తరువాత మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలానికి చెందిన టీడీపీ నేతలు పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పడం వెనకున్న కారణం ఏంటని ప్రశ్నించారు. మంగళగిరిలోని ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండ్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు బహిష్కరించిన తరువాత.. కొడుకు నారా లోకేష్‌ ఆదేశాలు లేకుండా దుగ్గిరాల మండల టీడీపీ శాఖ ఎలా నిర్ణయం తీసుకుంటుందని నిలదీశారు. చంద్రబాబు నిర్ణయాన్ని లోకేష్‌ వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. 
 

Back to Top