నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాలి

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

మంగళగిరిలో భారీ ర్యాలీ

డీజీపీకి ఎమ్మెల్యే ఆర్‌కే ఫిర్యాదు 

మంగళగిరి: గుంటూరులో మహిళా ఎస్సై అనురాధను కులం పేరుతో దూషించిన తెలుగుదేశం పార్టీ నేత నన్నపనేని రాజకుమారిని అరెస్టు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు.  టీడీపీ ఇటీవల చేపట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం సందర్భంగా  నన్నపనేని రాజకుమారి ఎస్‌ఐపై దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ  మంగళగిరిలో వైయస్‌ఆర్‌సీపీ   భారీ ర్యాలీ చేపట్టింది.  ఈ ర్యాలీలో   మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు నన్నపనేని రాజకుమారి దళిత మహిళా ఎస్సైతో దురుసుగా ప్రవర్తించారని, ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నన్నపనేని తీరుపై ఎమ్మెల్యే ఆళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే ఏపీ డీజీపీని కలిసి పోలీసులపై టీడీపీ నేతల దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశారు. కూన రవికుమార్‌, అచ్చెన్నాయుడు,నన్నపనేని రాజకుమారిలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. దళితులపై టీడీపీ నేతల దౌర్జన్యాలను డీజీపీకి ఎమ్మెల్యే వివరించారు. 
 

Back to Top